దుబ్బాకలో అధికార తెరాస కు షాక్ ఇస్తూ... బీజేపీ ఉప ఎన్నికను గెలిచి రికార్డు సృష్టించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1400 పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. 

ఎన్నిక జరగడానికి ముందు తెలంగాణాలో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్కటే నియోజకవర్గానికే ఇది ఉపఎన్నిక అయినప్పటికీ.... యావత్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆస్కారమున్న ఎన్నిక గనుక ప్రతిపక్ష బీజేపీ, అధికార తెరాస మధ్య రణరంగాన్ని తలపించింది. 

బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, రఘునందన్ ఇంట్లో డబ్బు దొరకడం వంటి హైడ్రామాలను మనం చూసాము. కూడా. ఈ సందర్భంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ప్రజల మద్దతు బీజేపీకే ఉందని, దాన్నెవ్వరు ఆపలేరని ఆయన కేసీఆర్ కి సవాల్ విసిరారు. 

అన్నట్టుగానే నేడు బీజేపీ విజయం సాధించిన వెంటనే ఆయన ట్విట్టర్ వేదికగా దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలతోపాటుగా శుభాకాంక్షలు తెలిపారు. ఓట్లు వేసిన్ధుకు దుబ్బాక ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ... కేసీఆర్ తప్పుడు రాజకీయాలకోర్చి, వాటిని ఓడించి గెలిచినా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి, ముఖ్యంగా పోరాడిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇక నేటి ఎన్నికలో దోబూచులాడింది ఫలితం చివరి రౌండులో రఘునందన్ రావు ను వరించింది. ఇన్ని రోజులపాటు అక్కడ వారు చేసిన కృషి, పడ్డ కష్టం అన్ని కూడా ఫలించాయని బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరొక రౌండ్ కౌంటింగ్ మిగిలి ఉండగానే బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.