Asianet News TeluguAsianet News Telugu

కరెంటు లేదా... దుస్తులారబెడితే సరి!

బట్టలు ఆరేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక విన్నూత్న విధానాన్ని కనుగొన్నాడు. ఈ విధానంలో చిటికెడు ఉప్పు చిన్న వస్త్రం ఉంటె చాలు.

drying clothes can produce electricity..new invention by indian professor
Author
New Delhi, First Published Oct 27, 2019, 9:46 AM IST

విద్యుత్తు కష్టాలు. ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇలాంటి విద్యుత్తు కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మన భారతీయ పరిశోధకుడు నూతన పరిష్కారాన్ని కనుక్కున్నాడు. బట్టలు ఆరేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక విన్నూత్న విధానాన్ని కనుగొన్నాడు. 

ఈ విధానంలో చిటికెడు ఉప్పు చిన్న వస్త్రం ఉంటె చాలు. ఉప్పు కలిపినా నీటిలో ఈ గుడ్డ ముక్కను ముంచి ఆరబెడితే సరిపోతుంది. ఈ వస్త్రం ఎండే లోపు విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని ఆవిష్కరణ చేసాడు మన ఐఐటీ పరిశోధకుడు. 

మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ తీగల ద్వారా చేర్చడం కష్టం అయినప్పుడు ఇలా వికేంద్రీకరించిన పద్ధతులు చాల ఉపయుక్తమవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఖర్చు సౌర ఫలకాలు ద్వారా ఉత్పత్తి చేసే సోలార్ ఎనర్జీ కన్నా చాల చవక. ఇది గ్రామీణ భారతంలో ఒక విప్లవం తీసుకురానుంది. 

దీని ఆవిష్కర్త సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ మన ఇండ్లలో బట్టలు ఆరబెట్టడమనేది సర్వ సాధారణ అంశం. ఉప్పు మన దైనందిన జీవితంలో ఒక విడదీయలేని ఒక వస్తువు. ఇలా ఈ రెండింటిని కలిపి వాడడం వల్ల ఇది చాలా ప్రత్యేకమైనది అని చెప్పాడు. 

drying clothes can produce electricity..new invention by indian professor

కేశనాళికీయత పద్ధతి ద్వారా ఈ పూర్తి వ్యవస్థ పని చేస్తుంది. దుస్తుల్లో ఉండే సెల్లులోజ్ ఒక నెట్ వర్క్ లాగ ఏర్పడతాయి. వాటిగుండా ఈ ఉప్పు కలిపినా నీరు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 

ఒక గ్రామంలో 3వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఒక 50 వస్త్రాలను ఆరబెట్టారు. ఇలా ఆరబెట్టినా వస్త్రాలను సూపర్ కండక్టర్ కు అనుసంధానం చేసారు. విద్యుత్తు ను ఒడిసిపట్టారు. రానున్న కాలంలో దీన్ని మరింత మెరుగుపరిచి మరింత సమర్థవంతగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని ఆ పరిశోధకుడు తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios