Asianet News TeluguAsianet News Telugu

బీహార్ వైద్యుల తెలివి: ఎడమ చేతికి కట్టాల్సిన కట్టు.. కుడి చేతికి

కుడిపక్క చేయాల్సిన ఆపరేషన్ ఎడమ పక్క చేసిన వైద్యుల ఉదంతాలు మనం ఇప్పటి వరకు ఎన్నో చూశాం. తాజాగా బిహార్‌లో ఓ వైద్యుడు ఎడమ చేతికి కట్టాల్సిన కట్టును కుడి చేతికి కట్టాడు. 

doctors cast plaster on boys wrong arm in bihar
Author
Bihar, First Published Jun 26, 2019, 5:12 PM IST

కుడిపక్క చేయాల్సిన ఆపరేషన్ ఎడమ పక్క చేసిన వైద్యుల ఉదంతాలు మనం ఇప్పటి వరకు ఎన్నో చూశాం. తాజాగా బిహార్‌లో ఓ వైద్యుడు ఎడమ చేతికి కట్టాల్సిన కట్టును కుడి చేతికి కట్టాడు.

వివరాల్లోకి వెళితే.. దర్భంగాకు సమీపంలో ఉంటున్న ఫైజాన్ అనే ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ మామిడి చెట్టు కింద నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో బాలుడి ఎడమ చేతి ఎముకకు తీవ్రగాయమైంది.

దీంతో బాబు కుటుంబసభ్యులు అతనిని దర్భంగా వూద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు ఎడమ చేయికి బదులు... కుడిచేతికి కట్టుకట్టి ఇంటికి పంపించారు.

తనకు కట్టుకడుతున్న సమయంలో బాలుడు ఈ విషయాన్ని వైద్యులకు చెప్పే ప్రయత్నం చేశాడు.. అయినప్పటికీ వారు ఫైజాన్ మాటను వినిపించుకోకుండా కుడిచేతికి కట్టు కట్టారు.

అంతేకాకుండా వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఫైజాన్‌కు ఔషధాలు కూడా ఇవ్వలేదని అతడి కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులు ఫిర్యాదు నమోదు చేసుకుని.. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాల్సిందిగా ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios