Asianet News TeluguAsianet News Telugu

మందుబాబుల సమాచారాన్ని టీచర్లు రహస్యంగా సేకరించాలి.. సర్కారు ఆదేశాలపై మండిపాటు

లిక్కర్ వ్యాపారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారని, ఎవరెవరూ రహస్యంగా మద్యాన్ని సేవిస్తున్నారో గుర్తించాలని రాష్ట్ర ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ సమాచారాన్ని మద్యపాన నిషేధ శాఖకు అందించాలని తెలిపింది. ఈ ఆదేశాలపై రాష్ట్ర ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. ఈ నెల 30వ తేదీన ఈ ఆదేశాల ప్రతులను దహనం చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు.
 

detect and inform the govt about drunkards bihar asks teachers
Author
Patna, First Published Jan 29, 2022, 5:26 PM IST

పాట్నా: పాఠశాలలో విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల(Teachers)కు తమ ఇష్టారీతిన ఆదేశాలు ఇవ్వడం బిహార్‌(Bihar)లో వివాదాస్పదంగా మారింది. రహస్యంగా లిక్కర్(Liquor) విక్రయిస్తున్నవారిని, మద్యాన్ని సేవిస్తున్నవారినీ గుర్తించే పనిని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అప్పజెప్పాలని బిహార్ ప్రభుత్వం నిర్ణియంచింది. అందుకోసం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఈ నెల 28వ తేదీన విద్యాశాఖకు చెందిన అన్ని రీజనల్ డైరెక్టర్లకు, జిల్లా ఎడ్యుకేషన్ అధికారులకు, ప్రొగ్రామ్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మొత్తంగా వీరిని లిక్కర్ నిషేధ కార్యక్రమానికి ఏజెంట్లు, గూఢచారులుగా వీరిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తమ తమ ప్రాంతాల్లోని తాగుబోతులను గుర్తించాలని ప్రాథమిక, సెకండరీ, హైయర్ పాఠశాలలు, ఉర్దూ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని వివరించారు.

ఈ సర్క్యూలర్ ప్రకారం మద్యపానాన్ని తీసుకుంటున్నవారు, లిక్కర్ వ్యాపారం చేస్తున్నవారిని గుర్తించాలని, ఆ సమాచారాన్ని మద్య నిరోధక శాఖకు చెందిన మూడు మొబైల్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఉన్నది. లిక్కర్ తాగడానికి, నిల్వ చేసుకోవడానికి పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని ఆదేశించింది. అయితే, ఇలా తాగుబోతుల సమాచారాన్ని ఇచ్చిన ఉపాధ్యాయుల వివరాల గోప్యంగా ఉంచుతామని వివరించారు. ఈ ఆదేశాలపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఈ సర్క్యూలర్ పై తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు, విద్యా శాఖకు చెందిన ఆదేశాల ప్రతులను దహనం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించుకున్నాయి.

రాష్ట్రంలో సుమారు నాలుగున్న ర లక్షల ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అందరూ ఈ వివాదాస్పద ఆదేశాల ప్రతులను కాల్చి వేస్తారని బిహార్ రాజ్య ప్రాథమిక్ శిక్షక్ సంఘ్ ప్రెసిడెంట్ ప్రదీప్ కుమార్ పప్పు తెలిపారు. ఈ ఆదేశాలు ఉపాధ్యాయలను ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, వారికి నాన్ టీచింగ్ పనులు చెబుతున్నారని ఆగ్రహించారు.

మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ సతీశ్ చంద్ర ఝా జూలై 24న ఉపాధ్యాయులకు జారీ చేసిన ఆదేశాలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా బియ్యాన్ని సరఫరా చేసిన గన్నీ బ్యాగులను రూ. 10 చొప్పున అమ్మేయాలని ఆదేశించారు. ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలతో కొందరు ఉపాధ్యాయులు గోనె సంచులను భుజాలపై మార్కెట్లకు తీసుకెళ్తున్న వీడియోలు దుమారం రేపాయి. 

అంతకు ముందు కూడా ఇలాంటి వివాదాస్పద ఆదేశాలు ఉపాధ్యాయులకు ఇచ్చారు. స్వచ్ఛతా మిషన్‌లో భాగంగా ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. వ్యవసాయ క్షేత్రాల్లో బహిరంగంగా మలవిసర్జన చేస్తున్న వారిని గుర్తించాలని, వారి పేర్లను పోలీసులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదిలా ఉండగా, ఈ నెలలోనే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాలను మరో గంట పాటు తెరిచేందుకు అనుమతించింది. తాజాగా ఇచ్చిన అనుమతుల మేరకు రాష్ట్రంలో రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.

Andhra pradesh రాష్ట్రంలో liquor దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 2934 రిటైల్ మద్యం దుకాణాలున్నాయి.  ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచనున్నారు. దీంతో రాత్రి 10 గంటల పాటు దుకాణాలను తెరిచి ఉంచనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios