నోయిడాలోని 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు గత మాసంలో ఇచ్చిన తీర్పును సవరించాలని సూపర్ టెక్ సంస్థ సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: నోయిడాలోని (noida) 40 అంతస్థుల ట్విన్ టవర్స్ (twin towers) ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు (supreme court) గత మాసంలో ఇచ్చిన తీర్పును సవరించాలని సూపర్ టెక్ కంపెనీ (super tech )ఉన్నత న్యాయస్థానాన్ని బుధవారం నాడు ఆశ్రయించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ 40 అంతస్థుల భవనంలో 900 ఫ్లాట్లున్నాయి. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ ట్విన్ టవర్స్ నిర్మించడంతో ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది.ట్విన్ టవర్లలో ఒక్కదాన్నే కూల్చివేయాలని ఆగష్టు 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిపుణుల పర్యవేక్షణలో ఈ భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వంత ఖర్చులతోనే ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని కోరింది

ట్విన్ టవర్లలో ఒక్క టవర్ నే కూల్చివేస్తామని సుప్రీంకోర్టును కోరింది సూపర్ టెక్ సంస్థ. సుప్రీంకోర్టు తీర్పును, న్యాయవ్యవస్థనుసవాల్ చేయాలనుకోలేదన్నారు.ఈ టవర్లలో మొత్తం 915 ప్లాట్స్, 21 దుకాణాలున్నాయి. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణ సమయంలో రెండు టవర్స్ మధ్య కనీస దూరం పాటించలేదని చీఫ్ సైట్ ఆఫీసర్ నోయిడా అధికారులకు లేఖ రాసినా కూడ పట్టించుకోలేదు.దీనిపై రెసిడెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ న్యాయ పోరాటం చేయగా సుప్రీంకోర్టు వారికి ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని ఆదేశించింది.