న్యూఢిల్లీ: 16 ఏళ్ల మైనర్ బాలిక తన ఇంట్లోని టెర్రస్ పై శిశువుకు జన్మనిచ్చింది. నార్త్ ఢిల్లీలోని తన ఇంట్లో బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు ప్రకటించారు.

ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వస్త్రంలో చుట్టిన శిశువును తాము స్వాధీనం చేసుకొన్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.

ఈ విషయమై శనివారం నాడు రాత్రి తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. తాము ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించిన సమయంలో బాలికతో పాటు శిశువు ఉన్నట్టుగా గుర్తించామని పోలీసులు గుర్తు చేశారు.

గత ఎనిమిది నుండి తొమ్మిది నెలల క్రితం 60 ఏళ్ల వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని చెప్పిన బాలికను పోలీసులు గర్తించారు.

ఈ విషయం ఇంట్లో తెలవకుండా ఆ బాలిక జాగ్రత్తపడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పుట్టిన శిశువును ఓ వస్త్రంతో కప్పి తన ఇంటికి దూరంగా ఉన్న దుకాాణం వద్ద ఉంచి ఆ బాలిక వెళ్లిందని పోలీసులు చెప్పారు.

ఈ ఘటనపై పోక్సో తో పాటు రేప్ కేసు కూడ నమోదు చేశామన్నారు పోలీసులు.బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా భావిస్తున్న షాప్ కీపర్ ను అరెస్ట్ చేశారు.

తల్లితో కలిసి ఆ బాలిక నార్త్ డిల్లీలో నివసిస్తోంది. షాప్ కీపర్ ఆమెపై గత 9 మాసాల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు.