స్పైస్‌జెట్‌కు చెందిన ఢిల్లీ-నాసిక్ విమానంలో సాంకేతిక సమస్యతో  త‌ల్లెత‌డంతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది.

ఇటీవ‌ల వరుసగా విమానలకు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ నుంచి నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ బోయింగ్ 737 విమానంలో ఆటోపైలట్ సమస్య కారణంగా మధ్యలోనే తిరిగి వచ్చింది. ఈ విష‌యాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ప్ర‌క‌టించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ‌డంతో ప్ర‌యాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. విమానంలో ఆటోపైలట్ సమస్య కు కార‌ణ‌మేంట‌నీ డీజీసీఏ పరిశీలిస్తోంది.

కాగా, గ‌త కొన్నినెలలుగా.. బ‌డ్జెట్ ఫ్రెండ్లీ విమాన‌యాన సంస్థ‌ స్పైస్‌జెట్ ఇబ్బందులు ప‌డుతుంది. 
అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత కార‌ణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీంతో పాటు వ‌రుస‌గా విమానాల్లో స‌మ‌స్య‌లు త‌ల్లెత‌డం భారంగా మారాయి. 

వరుస సాంకేతిక స్నాగ్‌ల కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, అలాగే.. జూలై 27న, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50 శాతం విమానాలను నడపాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించిన విష‌యం తెలిసిందే

సంస్థ అంతర్గత సమస్యలతో ఉద్యోగులకు వరుసగా రెండవ నెల జీతాల పంపిణీలో జాప్యం జరిగిందని ఆరోపించారు, బడ్జెట్ ఎయిర్‌లైన్ చెల్లింపులను గ్రేడెడ్ ఫార్మాట్‌లో చేసినట్లు చెప్పారు. జూలై నెలలో విమాన సిబ్బందితో సహా సిబ్బందికి జీతం పంపిణీలో జాప్యం జరిగిందనీ, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా మందికి ఫారం 16 ఇంకా అందలేదని స్పైస్‌జెట్ ఉద్యోగులు పేర్కొన్నారు.స్పైస్‌జెట్ గ‌త త్రైమాసికంలో 789 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించిన విష‌యం తెలిసిందే.