తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండర్, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు. పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటన మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ఢిల్లీ : భార్యను అత్యంత దారుణంగా murder చేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన ఘటన Delhiలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ భర్త గురువారం ఉదయం ఢిల్లీలోని గోవింద్ పురి police stationకు వచ్చి లొంగిపోయాడు. తన భార్యను Scissorsతో పొడిచి చంపానని చెప్పి భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండర్, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు. పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటన మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇలాంటి ఘటనే ముంబైలో మంగళవారం జరిగింది. ముప్పై రూపాయలు ఎక్స్ ట్రా ఇవ్వలేదని ఓ కస్టమర్ ను దర్జీ Scissorsతో పొడిచి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ముంబయిలో అంధేరి ప్రాంతంలో మంగళవారం జరిగింది. హరీశ్ టకార్ అనే Tailor వద్దకు రోహిత్ యాదవ్ రెండు రోజుల క్రితం.. Pant మార్చి కుట్టాలని తీసుకువచ్చాడు. రూ. 100 కూలీగా మాట్లాడుకున్నారు. 

మరుసటి రోజు రోహిత్ వెళ్లగా.. రూ.30 అదనంగా ఇవ్వాలని అడిగాడు హరీష్. ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ప్యాంటు తీసుకుని తిరిగి వెల్తున్న అతని మీద కత్తెరతో దాడి చేశాడు. రోహిత్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. హరీష్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

కాగా, నిరుడు అక్టోబర్ 22న కర్ణాటకలో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ టైలర్ ను ఆ వ్యక్తి కత్తెరతో పొడిచి చంపాడు. బెంగళూరు బనశంకరిలోని yarab nagarలో మహిళ టైలర్ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యారు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి.

ఈ దారుణానికి కారణం ఆమె బంధువైన PUC student (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే accused కుటుంబం కొత్తగా ఇల్లు కడుతుంది. ఈ క్రమంలో అబ్బాయి ఆమె ఇంటికి తరచు వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య Extramarital affair ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దాం అని, హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బులు ఇవ్వాలని ఆమెను అతడు పీడించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత ఆమె ఇంటికి వచ్చిన అబ్బాయి Scissors తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా, అక్టోబర్ 20, బుధవారంనాడు పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళను కత్తెరతో పొడిచి చంపడం స్థానికంగా కలకలం రేపింది. yarab nagar 16వ క్రాస్ నివాసి టైలరింగ్ చేసే ఆఫ్రీనా ఖానం ఈ ఘటనలో మృతి చెందింది. ఆమెకు భర్త లాలూ ఖాన్ తో పాటు.. 3, 5 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.