Asianet News TeluguAsianet News Telugu

ఫోన్ రీప్లేస్ చేయలేదని.. సర్వీస్ సెంటర్ ఎదుట ఆత్మాహుతి దాడి

ఫోన్ కొన్న వారం రోజులపాటు బాగానే పనిచేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు.. అది పాడైపోయింది. దీంతో భీమ్‌ నవంబర్‌ 6వ తేదీన సెల్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్‌ వద్దకు వెళ్లాడు. 

Delhi man attempts self-immolation after service centre denies replacement of faulty handset
Author
Hyderabad, First Published Nov 14, 2020, 2:06 PM IST

తాను ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ పాడైపోవడంతో చాలా బాధపడ్డాడు. ఫోన్ సర్వీస్ సెంటర్ కి వెళ్లి.. పాత ఫోన్ కి బదులు కొత్త ఫోన్ ఇవ్వాలని కోరాడు. అందుకు ఆ సర్వీస్ సెంటర్ అంగీకరించలేదు. అంతే.. అదే సర్వీస్ సెంటర్ ముందు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని రోహినీలో ఓ యువకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ప్రహ్లాద్ పూర్ గ్రామానికి చెందిన భీమ్ సింగ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఓ కొత్త ఫోన్ కొనుగోలు చేశాడు. ఫోన్ కొన్న వారం రోజులపాటు బాగానే పనిచేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు.. అది పాడైపోయింది. దీంతో భీమ్‌ నవంబర్‌ 6వ తేదీన సెల్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్‌ వద్దకు వెళ్లాడు. అయితే వారు సెల్‌ఫోన్‌ను రీప్లేస్‌ చేయటం కుదరదని చెప్పారు.

మరికొన్నిసార్లు సర్వీస్‌ సెంటర్‌ చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం షాపు ముందు ఒంటికి నిప్పంటించుకున్నాడు. మంటల్లో తీవ్రగాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ తరచుగా హీటెక్కేదని, ఉన్నట్టుండి బ్యాటరీ పేలి పోయిందని బాధితుడి భార్య పూనమ్‌ పోలీసులకు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios