ప్రస్తుతం దేశంలో కొత్త ట్రాఫిక్ నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ట్రాఫిక్ రూల్స్ ని అతి క్రమించినందుకు ఓ వ్యక్తికి జరిమానా విధించారు. కాగా... అతను కోపంతో బైక్ ని తగలపెట్టాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఢిల్లీలోని షేక్ సెరాయి ప్రాంతంలో ఓ యువకుడు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించాడు. దీంతో... అతనికి ట్రాఫిక్ పోలీసులు రూ.3,900 జరిమానా విధించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి... వెంటనే తన ద్విచక్రవాహనాన్ని తగలపెట్టాడు. అతను చేసిన పనికి అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. ఇదిలా ఉండగా... సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దాని ప్రకారం అతనికి జరిమానా విధించగా...అంత ఎక్కువ మొత్తంలో జరిమానా రావడాన్ని అతను తట్టుకోలేక అలా చేశాడు.