Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లోనే మహిళ, నలుగురు పిల్లలు మృతి.. వారి మరణానికి కారణం అదేనా..?

దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో  షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు మరణించారు. వారిలో ఓ మహిళ, నలుగురు పిల్లలు ఉన్నారు. 
 

Delhi Five die after inhaling toxic smoke from angithi
Author
New Delhi, First Published Jan 19, 2022, 5:36 PM IST

దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో  షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పొయ్యి నుంచి వెలువడిని విషపూరితమైన పొగ కారణంగా.. ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు మరణించారు. వివరాలు.. పాత సీమాపురి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌‌లో 5వ అంతస్తు గదిలో పడిపోయి ఉన్నారని ఢిల్లీ పోలీసులకు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ కనిపించిన సీన్ చూసి వారు షాక్ తిన్నారు. అక్కడ ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు శవమై కనిపించారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అతడు కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిర వారిని 30 ఏళ్ల రాధ.. ఆమె ఇద్దరు కూతుళ్లు (ఒకరికి 11 ఏళ్లు, మరోకరికి నాలుగేళ్లు), ఇద్దరు కొడుకులు (ఒకరికి 8 ఏళ్లు, మరోకరికి మూడేళ్లు) గా గుర్తించారు. మంగళవారం రాత్రి చలి కారణంగా గదిలో పొయి వెలగించిన రాధ, పిల్లలతో కలిసి నిద్రించింది. దిలో తలుపులు, కిటికీలు అన్నీ మూసి ఉంచారు. అయితే వారు నిద్రలోకి జారుకున్నాక వెలిగించి ఉంచి పొయి నుంచి విషపూరితమైన పొడ వెలువడంతో వారు మరణించి ఉంటారనే ప్రాథమికంగా తెలుస్తోంది. 

సీమాపురి ప్రాంతంలో ఓ మహిళ, ఆమె నలుగురు పిల్లల మృతదేహాలు కనుగొన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆ గదిలో ఒక పొయ్యి ఉండటం గుర్తించినట్టుగా చెప్పారు. అయితే వారి మరణానికి గల కారణంపై స్పష్టత లేదని చెప్పారు. అయితే పోస్టుమార్టమ్ రిపోర్ట్ తర్వాత వారి మరణాలకు గల కారణలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

అయితే రాధ నివాసం ఉంటున్న రూమ్ యజమాని అమర్ పాల్ సింగ్.. ప్రస్తుతం షాలిమార్ గార్డెన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతను రెండు రోజుల క్రితమే ఆ ఇంటికి అద్దెకు ఇచ్చానని చెప్పారు. ఇక, ఈ ఘటనతో చుట్టుపక్కల వారందరూ షాక్‌కు గురయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios