Asianet News TeluguAsianet News Telugu

షెల్ ఎంటిటీల ద్వారా పన్ను ఎగవేత... దైనిక్ భాస్కర్ గ్రూప్‌పై ఆరోపణలు

నకిలీ ఖర్చులు , షెల్ ఎంటిటీలను ఉపయోగించి కొనుగోళ్లను క్లెయిమ్ చేయడం ద్వారా దైనిక్ భాస్కర్ గ్రూప్ భారీగా పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనామా లీక్స్ కేసులోనూ డీబీ గ్రూప్ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి

Dainik Bhaskar Group accused of using shell entities to evade tax ksp
Author
New Delhi, First Published Jul 22, 2021, 8:56 PM IST

ప్రముఖ జాతీయ దినపత్రిక దైనిక్ భాస్కర్‌కు చెందిన కీలకమైన ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 132 కింద సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, జైపూర్, కోర్బా, నోయిడా, అహ్మదాబాద్ నగరాలతో సహా 32 చోట్ల దైనిక్ భాస్కర్ విస్తరించి వుంది. దైనిక్ భాస్కర్ గ్రూప్ వివిధ రంగాలలో వ్యాపారం నిర్వహిస్తోంది. ప్రధానంగా మీడియా, పవర్, టెక్స్‌టైల్స్, రియల్ ఎస్టేట్ వున్నాయి. ఈ గ్రూప్ టర్నోవర్ సంవత్సరానికి రూ .6000 కోట్లకు పైమాటే. ఈ గ్రూపులో హోల్డింగ్ అనుబంధ సంస్థలతో సహా 100 కి పైగా కంపెనీలు ఉన్నాయి. డిబి కార్ప్ లిమిటెడ్ ప్రతిరోజూ వార్తలను ప్రచురిస్తుంది. దైనిక్ భాస్కర్. 

ALso Read:దైనిక్ భాస్కర్ సహా మరో న్యూస్ ఛానల్‌పై ఐటీ దాడులు.. కేంద్రంపై విపక్షాల ఆగ్రహం

ఇక డీబీ పవర్ లిమిటెడ్ పేరిట బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం జరుగుతుంది. ఈ గ్రూప్‌కి చెందిన ప్రధాన వ్యక్తులు ముగ్గురు సోదరులు. వారు సుధీర్ అగర్వాల్, పవన్ అగర్వాల్ , గిరీష్ అగర్వాల్. నకిలీ ఖర్చులు , షెల్ ఎంటిటీలను ఉపయోగించి కొనుగోళ్లను క్లెయిమ్ చేయడం ద్వారా దైనిక్ భాస్కర్ గ్రూప్ భారీగా పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఈ గ్రూప్ అనేక షెల్ కంపెనీలను తెరిచింది. వారి ఉద్యోగులే వాటాదారులు, డైరెక్టర్లుగా ఉన్నారు. మారిషస్ ఆధారిత సంస్థల ద్వారా వాటా ప్రీమియంతో పాటు విదేశీ పెట్టుబడుల రూపంలో ఈ పద్ధతిలో తొలగించబడిన డబ్బు తిరిగి వివిధ మార్గాల్లో పెట్టుబడులలోకి మార్చబడుతున్నట్లు ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన పనామా లీక్స్ కేసులోనూ డీబీ గ్రూప్ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. డిపార్ట్‌మెంటల్ డేటా బేస్ బ్యాంకింగ్ ఎంక్వైరీ, ఇతర విచారణల ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఈ సోదాలు నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios