Asianet News TeluguAsianet News Telugu

బురేవి తుఫాను : ఆ రెండు రాష్ట్రాలకు హెచ్చరిక..

డిసెంబర్ 4 శుక్రవారం నాడు బురేవీ తుఫాను తమిళనాడు మీద విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. గురువారం సాయంత్రానికి లేదా రాత్రికి శ్రీలంకలోని త్రింకోమలి దగ్గరున్న తీరాన్ని దాటనుందని తెలిపింది. 

Cyclone Burevi: Alert issued by IMD for these two states - bsb
Author
Hyderabad, First Published Dec 2, 2020, 11:14 AM IST

డిసెంబర్ 4 శుక్రవారం నాడు బురేవీ తుఫాను తమిళనాడు మీద విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. గురువారం సాయంత్రానికి లేదా రాత్రికి శ్రీలంకలోని త్రింకోమలి దగ్గరున్న తీరాన్ని దాటనుందని తెలిపింది. 

తీరం దాటే సమయానికి తుఫాను గంటకు 75-85 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, గంటకు 95 కిలోమీటర్ల వేగంతో చురుకుగా కదులుతుందని భావిస్తున్నారు. 

"ఇది దాదాపు పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది, డిసెంబర్ 3 ఉదయం గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని ప్రక్కనే ఉన్న కొమొరిన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. తరువాత ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదిలి, కన్యాకుమారి - పంబన్ ల మధ్య దక్షిణ తమిళనాడు తీరాన్ని డిసెంబర్ 4 తెల్లవారుజామున దాటుతుంది." అని IMD అన్నారు.

తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెంకాసి, రామనాథపురం మరియు శివగంగైలకు డిసెంబర్ 2, 3 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

బురేవీ ప్రభావంతో కేరళలో తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజాల్లో డిసెంబర్ 3 న భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

"డిసెంబర్ 4 వరకు దక్షిణ-ఉత్తర టిఎన్, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ-ఉత్తర కేరళ, మాహే, దక్షిణ తీరప్రాంత ఆంధ్ర, లక్షద్వీప్లకు వర్షపాతం హెచ్చరిక. డిసెంబర్ 2 సాయంత్రం / రాత్రి ట్రింకోమలీకి దగ్గరగా ఉన్న ఎస్ఎల్ తీరాన్నిదాటుతుంది. తరువాత ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 4 తెల్లవారుజామున కన్యాకుమారి - పంబన్ ల మధ్య దక్షిణ తమిళనాడు తీరాన్ని దాటుతుంది’’ అని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ కారణంగా డిసెంబర్ 3న తిరువనంతపురం జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను బురేవి హెచ్చరిక నేపథ్యంలో డిసెంబర్ 2,  4 తేదీలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది" అని కూడా తెలిపింది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరప్రాంతాల్లో  డిసెంబర్ 2-3 తేదీల్లో చెదురు మదురు వర్షాల నుండి,  భారీ వర్షపాతం నమోదవుతుంది. అలాగే డిసెంబర్ 3-4 తేదీల్లో లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

మత్స్యకారులు డిసెంబర్ 1-3 నుండి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించవద్దని సూచించారు. కొమొరిన్ ఏరియా, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు-కేరళ తీరాలలో ఫిషింగ్ కార్యకలాపాలను డిసెంబర్ 2-4 నుండి అధికారులు నిలిపివేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios