Asianet News TeluguAsianet News Telugu

క‌డుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌..  వాటి విలువ రూ.13 కోట్లకు పై మాటే.. 

ఓ విదేశీయుడు త‌న క‌డుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌ను దాచిపెట్టుకుని భార‌త్ కు వ‌చ్చారు. ఆ వ్య‌క్తిని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ‌ సుమారు 13 కోట్లకు పై మాటేనంట‌. ఈ కేసులో పోలీసులు మ‌రింత విచార‌ణ చేప‌డుతున్నారు.

customs recovers cocaine capsules worth Rs 13 crore swallowed by Ghana passenger
Author
First Published Sep 3, 2022, 5:40 PM IST

మత్తుప‌దార్థాల అక్ర‌మ ర‌వాణాను అరికట్టేందుకు విమానాశ్రయం సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. డ్ర‌గ్స్ మాఫియా ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా రవాణాకు కొత్త కొత్త మార్గాల్లో తీసుక‌వ‌స్తూ..  అడ్డంగా దొరికిపోతున్నారు. 
  
తాజాగా.. ముంబై క‌స్ట‌మ్స్ డిపార్ట్‌మెంట్ కొకైన్ స్మగ్లింగ్ ఆరోపణలపై ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఘనా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేసింది. ఆ వ్య‌క్తి త‌న‌ క‌డుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌ను దాచిపెట్టుకుని  ఘనా నుండి భారతదేశానికి వచ్చాడు.

కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటన ప్ర‌కారం.. ఘనా ప్రయాణీకుడి నుండి 1,300 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ.13 కోట్లు. అనుమానంతో ఆగస్ట్ 28న ఆ ప్రయాణికుడిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పాక్స్ అనే ఘనా దేశస్థుడు ముంబై విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారులు సోదాలు చేయగా, అధికారులు అతని లగేజీలో ఏమీ కనుగొనలేదు, కానీ అత‌ని ప్ర‌వర్త‌న తేడాగా ఉండ‌టంతో  అధికారులు అతనిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్క‌డ‌ స్కానింగ్ చేయ‌డంతో మ‌త్తుప‌దార్థాల‌తో కూడిన‌ క్యాప్సూల్స్ మింగినట్లు గుర్తించారు. మూడు రోజుల అనంతరం.. మింగిన 87 క్యాప్సూల్స్ బయటకు తీశారు.  ప్రయాణికుడిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios