Asianet News TeluguAsianet News Telugu

నేరగాడికి భారతరత్నా..! : అద్వానీపై సిపిఐ రాజా సంచలనం

భారత మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్ నేత అద్వానీని భారత రత్నగా ప్రకటించడంపై సిపిఐ నేత రాజా సంచలన వ్యాఖ్యలు చేసారు. 

CPI Leader Raja Sensational comments on Bharat Ratna LK Advani AKP
Author
First Published Feb 5, 2024, 9:52 AM IST | Last Updated Feb 5, 2024, 9:54 AM IST

హైదరాబాద్ : బిజెపి నేత, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానికి భారత అత్యున్నత పురస్కారం 'భారతరత్న' అవార్డుతో సత్కరించడంపై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన నేరస్తుడికి భారతరత్న ఇవ్వడమేంటంటూ రాజా సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ లోని ముగ్దుం భవన్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా చివరిరోజు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ఈ సమావేశంతో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో చర్చించిన విషయాలు, తీర్మానాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగానే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై రాజా స్పందించారు. 

Also Read  ‘రథయాత్ర’ అంటే అద్వానీ.. అయోధ్య రామాలయానికి ఇదెలా దారితీసింది?

అయితే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్రనేత అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ తో పాటు 32 మంది కేసులు ఎదుర్కొన్నారు.  28 ఏళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అద్వానీతో పాటు మిగతావారిని నిర్దోషులుగా తేల్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం బాబ్రీ మసీదు కూల్చివేత జరగలేదని... అప్పటికప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని న్యాయస్థానం నిర్దారించింది.  దీంతో అద్వానీతో మిగతావారిపై నమోదయిన కేసులు కొట్టివేస్తూ తుది తీర్పు ఇచ్చింది లక్నో కోర్టు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios