Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో తగ్గుతున్న కేసులు: ముప్పు వెంటాడుతోందన్న మోడీ

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతుండటంతో దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.

Covid Situation In Maharashtra Worrying, Follow Safety Measures, says pm modi
Author
New Delhi, First Published Oct 13, 2020, 2:56 PM IST

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతుండటంతో దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వైరస్ ముప్పు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నందున భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆటోబయోగ్రఫీని విడుదల చేసిన అనంతరం నరేంద్రమోడీ మాట్లాడారు.

కరోనా నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని ఆయన కోరారు. మహారాష్ట్రలో పరిస్ధితి కొంత ఆందోళనకరంగా ఉందని, వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 55,342గా నమోదైంది. ఆగస్ట్‌ 18 తర్వాత కేసుల సంఖ్య ఈరోజు అతితక్కువగా నమోదైంది. గత నెలలో 90,000కు పైగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నమోదవగా తాజాగా ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఇక తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరగా మరణించిన వారి సంఖ్య 1,09,856గా నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios