భారత్ లో కరోనా వికృత రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి.  ఇప్పటి వరకు ఈ వైరస్ కి మందు కనుగొలేకపోయారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో దేశంలో కరోనా విపరీతంగా విజృంభిస్తోంది.

కేవలం నిన్న ఒక్కరోజే దేశంలో 40వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు దేశంలో ఇదే అత్యధిక కేసులు కావడం గమనార్హం. దీంతో.. దేశంలో కరోనా కేసులు 1.1 మిలియన్లకు చేరిపోయాయి. కేవలం గత మూడు రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

భారత్ లో గత 24గంటల్లో 40,118 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. 675మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మొత్తం కేసులు 1,116,597 గా నమోదు కాగా.. ఇప్పటి వరకు 27,487మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. పలు రాష్ట్రాల్లో ఆదివారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 9,518 కేసులు నమోదవ్వగా.. తమిళనాడులో 4,979 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 5,041 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కేవలం ఒక్క రోజులోనే ఈ మూడు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవ్వడం అందరినీ కలవరపెడుతోంది.

ఒక ఉత్తరప్రదేశ్ లో 2,211 మందికి కరోనా సోకగా.. పశ్చిమ బెంగాల్ లో 2,278మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఢిల్లీలో 1211 మంది కొత్త గా కరోనా సోకగా.. తెలంగాణలో 1296మందికి పాజిటివ్ గా తేలింది. కర్ణాటకలో4,120 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బిహార్ లో 1412 మందికి వైరస్ సోకగా.. రాజస్థాన్ లో 934 మందికి , జమ్మూకశ్మీర్ లో 701 మందికి గత 24గంటల్లో కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 

గత వారంతో పోలిస్తే.. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయానని నిపుణులు చెబుతున్నారు. యావరేజ్ గా ప్రతిరోజూ దేశంలో 34వేల కేసులు నమోదౌతున్నాయి. గత వారం యావరేజ్ గా 26వేల కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన దేశంలో కరోనా ఏవిధంగా పాకుతుందో స్పష్టంగా తెలిసిపోతోంది. దేశంలో కరోనా కేసులతోపాటు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు.