Asianet News TeluguAsianet News Telugu

corona virus : ఢిల్లీలో కేసులు త‌గ్గినా.. ఇప్పుడే ఆంక్ష‌లు స‌డ‌లించం- హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్ జైన్

ప్రస్తుతం దేశ రాజధానిలో కేసులు తగ్గుతున్నాయని, అయినా ఇప్పుడే ఆంక్షలు సడలించబోమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఆక్యుపెన్సీ లేదని, చాలా బెడ్స్ ఖాళీగానే ఉన్నాయని మంత్రి తెలిపారు. 

corona virus : Cases in Delhi drop .. Sanctions relaxed now - Health Minster Satyender Jain
Author
Delhi, First Published Jan 19, 2022, 4:50 PM IST

దేశ రాజ‌ధానిలో క‌రోనా (corona) కేసులు త‌గ్గుతున్నాయి. గ‌త వారం, ప‌ది రోజుల నుంది దాదాపు 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌ద‌య్యాయి. అయితే ఇటీవ‌ల కేసులు తక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసింది. నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ క‌ర్ఫ్యూలు విధించింది. గ‌త నెల‌లో వ‌చ్చిన క్రిస్మ‌స్, న్యూయ‌ర్ వేడుక‌ల‌ను కూడా ర‌ద్దు చేసింది. ప్ర‌జ‌లు గుమిగూడకుండా చ‌ర్య‌లు తీసుకుంది.

కోవిడ్ -19 (covid - 19) నియంత్ర‌ణ‌లో భాగంగా ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ddma) ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేసింది. ఢిల్లీలోని ప్రైవేటు ఆఫీసుల‌న్నీ వ‌ర్క్ ఫ్రం హోం (work form home) విధానాన్నే అవ‌లంభించాల‌ని అదేశించింది. కొన్ని అత్య‌వ‌స‌ర సేవలు అందించే ఆఫీసుల‌కు మాత్ర‌మే వీటి నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో పాటు రెస్టారెంట్ల‌లో భోజనం చేసే సౌక‌ర్యాన్ని నిలిపివేసింది. కేవ‌లం ఫుడ్ హోం డెలివ‌రీల‌కు,  పార్శిల్ సేవ‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఇలా అనేక ఆంక్ష‌లు అమ‌లు చేస్తూ కేసుల వ్యాప్తిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ప్ర‌య‌త్నాలు అన్నీ కొంత మేర‌కు స‌త్ప‌లితాల‌ను ఇచ్చాయి. ఇప్పుడిప్పుడే కేసులు త‌గ్గుముఖం ప‌డ‌తున్నాయి. 

ఢిల్లీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న క్ర‌మంలో ఆంక్ష‌లు స‌డలిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్ జైన్ (delhi health minister satyendar jain) స్పందించారు. దేశ రాజధానిలో కేసుల సంఖ్య, టెస్ట్ పాజిటివిటీ రేటు త‌గ్గిన‌ప్ప‌టికీ ప్రస్తుతం కోవిడ్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించే ఆలోచ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని ఆయ‌న చెప్పారు. కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితిపై బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో టెస్ట్ పాజిటివిటీ రేట్ (test possitivity rate) 30 శాతం నుంచి 22.5%కి తగ్గింద‌ని అన్నారు. అలాగే కేసుల సంఖ్య కూడా తగ్గింద‌ని చెప్పారు. అయినప్ప‌టికీ తాము కోవిడ్ -19 ప‌రిమితుల‌ను స‌డిలించేంత త‌క్కువ‌గా ఇప్పుడు పాజిటివిటీ రేటు లేద‌ని అన్నారు. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోవిడ్ నియంత్ర‌ణ‌ల‌ను స‌మీక్షించే ముందు టెస్ట్ పాజిటివిటీ రేటు ధోర‌ణిని నిర్ధారించడానికి ప్రభుత్వం మూడు నుంచి నాలుగు రోజుల పాటు కోవిడ్ - 19 (COVID-19) పరిస్థితిని పర్యవేక్షిస్తుంద‌ని హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్ జైన్ అన్నారు. ప్ర‌స్తుతం హాస్పిటల్స్ లో ఎక్కువ‌గా ఆక్యుపెన్సీ లేద‌ని అన్నారు. చాలా ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపారు. ఢిల్లీలో మరిన్ని క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని అన్నారు. నేడు దాదాపు 13 వేల వ‌ర‌కు కొత్త కోవిడ్ -19 కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని, టెస్ట్ పాజిటివిటీ రేటు 24 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో ఎవ‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌ను తిర‌స్క‌రించ‌డం లేద‌ని  మంత్రి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుసరిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో గత ఆరు నెలలుగా రోజూ 50 వేల నుంచి 60 వేల క‌రోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో మంగళవారం 11,684 కొత్త కోవిడ్‌ కేసులు, 22.47 శాతం పాజిటివ్‌ రేటు న‌మోదైంది. సోమ‌వారం 12,527 కేసులుచ‌ 27.99 శాతం టెస్ట్ పాజిటివిటీ రేటుగా రికార్డ్ అయ్యింది.  24 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios