Asianet News TeluguAsianet News Telugu

హత్రాస్ కేసు: సృతీ ఇరానీకి నిరసన సెగ, కాన్వాయ్‌ని చుట్టుముట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి హథ్రాస్ సెగ తగిలింది. శనివారం వారణాసి వచ్చిన ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Congress workers block Union minister Smriti Irani in varanasi
Author
Varanasi, First Published Oct 3, 2020, 3:52 PM IST

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి హథ్రాస్ సెగ తగిలింది. శనివారం వారణాసి వచ్చిన ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ , ప్రియాంక గాంధీలు హథ్రాస్‌లో పర్యటించి బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్మృతీ కాన్వాయ్‌ని కాంగ్రెస్ శ్రేణులు చుట్టుముట్టడంతో అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, హథ్రాస్ అమానుషంపై దేశంలో ఇంకా నిరసనలు జరుగుతూనే వున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ మధ్యాహ్నం మరోసారి హథ్రాస్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

రెండు రోజుల క్రితం రాహుల్, ప్రియాంకలను యూపీ పోలీసులు నోయిడా వద్దే అడ్డుకున్నారు. అయితే శనివారమైనా వారిని బాధితురాలి గ్రామంలోకి వెళ్లనిస్తారా లేదా అన్నది తేలాల్సి వుంది.

రాహుల్, ప్రియాంకలు వస్తుండటంతో నోయిడాలో భారీగా బలగాలను మోహరించారు. అటు ఈ దారుణం వెలుగుచూసిన తర్వాత తొలిసారిగా గ్రామంలోకి మీడియాను అనుమతించారు.

గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో మీడియా ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు.. బాధితురాలి ఇంటిని పరిశీలించారు.

ప్రస్తుతానికి మీడియాను మాత్రమే అనుమతించామని.. పై అధికారుల ఆదేశాలు అందిన తర్వాత ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబసభ్యుల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ డీజీపీ కూడా ఇవాళ హథ్రాస్‌లో పర్యటించనున్నారు. అటు ఈ దారుణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం.. బాధితురాలి కుటుంబానికి నార్కోటిక్ ఎనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు ఈ ఘటనలో విధులు సక్రమంగా నిర్వహించని ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios