సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.  రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చూస్తోన్న ప్రియాంక గాంధీని తప్పించి.. ఆమె స్థానంలో అవినాష్ పాండేకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. 

సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో పొత్తులపై ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. అలాగే నిధుల సమీకరణ కోసం క్రౌడ్ ఫండింగ్‌కు సిద్ధమైంది. తాజాగా రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లను మార్చడంతో పాటు సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చూస్తోన్న ప్రియాంక గాంధీని తప్పించి.. ఆమె స్థానంలో అవినాష్ పాండేకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. 

ఇకపోతే.. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన మాణిక్‌రావ్ థాక్రేను ఆ స్థానం నుంచి తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఆయనను గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హావేలీ బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకురాలిగా పనిచేసిన దీపాదాస్ మున్షీకి కేరళ, లక్ష్యద్వీప్‌తో తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గతంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మాణికం ఠాగూర్‌కు ఏపీ, అండమాన్ నికోబార్ వ్యవహారాలను అప్పగించారు. 

Also Read: మాణిక్ రావ్ థాక్రేపై వేటు .. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా దీపా దాస్ మున్షీ , ఏపీకి ఠాగూర్

అజయ్ మాకెన్‌ను ట్రెజరర్‌గా, మిలింద్ దేవరా, విజయ్ ఇందర్ సింగ్లాను జాయింట్ ట్రెజరర్లుగా నియమించారు. జనరల్ సెక్రటరీగా వున్న తారిక్ అన్వర్‌ను ఇన్‌ఛార్జ్‌లుగా భక్తచరణ్ దాస్, హరీశ్ చౌదరి, రజనీ పాటిల్, మనీశ్ చత్రాఠ్‌ను ఆయా బాధ్యతల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు.