హైదరాబాద్: మహారాష్ట్రలో బీజేపీ హవా కొనసాగుతుందని సీఎన్ఎన్ సర్వే స్పష్టం చేసింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తోందని తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 141 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. 

తర్వాత స్థానంలో శివసేన నిలవనుందని తెలిపింది.102 స్థానాలను శివసేన కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాలకే పరిమితం కాగా ఎన్సీపీ 22 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. ఇతరులు నాలుగుచోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. 

బీజేపీ-141 

శివసేన-102

కాంగ్రెస్-17

ఎన్సీపీ-22

ఇతరులు-04

Read more #exitpolls: మహారాష్ట్రలో బీజేపీ హవా, వార్ వన్ సైడ్ ... ఏబీపీ సి ఓటర్ సర్వే ...

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

Read more Times now exit polls:మహారాష్ట్రలో అధికారం వైపు కమలం అడుగులు...

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. 

వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది.