మహారాష్ట్రలో బిజెపి ప్రచార హోరు ... రంగంలోకి యూపీ సీఎం యోగి

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యనాథ్  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  ఇవాళ ఒక్కరోజే ఆయన మూడు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.  

CM Yogi Maharashtra Election Rally Devuthani Ekadashi AKP

నాగ్‌పూర్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రముఖ నాయకులంతా ఒక్కొక్కరుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవుఠని ఏకాదశి పర్వదినాన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా రంగంలోకి దిగారు. ఇవాళ (మంగళవారం) ఆయన మహారాష్ట్రలో మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మొదటి అచల్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అకోలా పశ్చిమ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. చివరగా  రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోసం నాగ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తారు.

జార్ఖండ్, మహారాష్ట్రలలో వరుస సభలు

సీఎం యోగీ జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయన తన రాష్ట్ర ఉప ఎన్నికలపై కూడా దృష్టి సారిస్తున్నారు. మధ్య మధ్యలో యూపీలోని స్థానాలకు కూడా ప్రచారానికి వెళ్తున్నారు. యూపీలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం యోగీ బీజేపీ స్టార్ ప్రచారకర్త కావడంతో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెళ్తున్నారు.

 మహారాష్ట్ర అయినా, జార్ఖండ్ అయినా లేదా యూపీ ఉప ఎన్నికలైనా మూడు చోట్లా బీజేపీకి చెందిన రెండు నినాదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ప్రధాని మోదీ తన ప్రతి ఎన్నికల సభలో 'ఏక్ హై తో సురక్షిత్ హై' (ఒక్కటిగా వుంటే సురక్షితంగా వుంటాం) అని చెబుతుంటే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ 'బటెంగె తొ కటెంగె' (వివాదాలు తలెత్తి విడిపోతే చెల్లాచెదురవుతాం)  అని అంటున్నారు. ఫలితాల్లో ఏ నినాదం వారికి విజయం అందిస్తుందో చూడాలి.

 ఆచల్‌పూర్‌లో సీఎం యోగీ మొదటి బహిరంగ సభ

 

  అకోలాలో సీఎం యోగీ రెండవ బహిరంగ సభ

 

 సాయంత్రం నాగ్‌పూర్‌లో సీఎం యోగీ మూడవ బహిరంగ సభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios