ఉపాధ్యాయుడి అవతారమెత్తిన యూపీ సీఎం ... స్టూడెంట్స్ కు ఏం భోదించారో తెలుసా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌లోని అటల్ ఆవాసీయ విద్యాలయంలో విద్యార్థులతో సరదాగా సమయం గడిపారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు, వారి సందేహాలను నివృత్తి చేశారు.
లక్నో : అటల్ ఆవాసీయ విద్యాలయాల విద్యార్థులకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముచ్చటించారు. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌లోని విద్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి విద్యార్థులతో విలువైన సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా సీఎం యోగీ ప్రతిభావంతులైన విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలను పరిశీలించారు... అలాగే తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. సీఎం యోగీ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు స్పూర్తిదాయక పాటాలు చెప్పారు... విద్యార్థులు అడిగిన సందేహాలను కూడా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగీ విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు దిగారు.
విద్యార్థులు రూపొందించిన నమూనాలను చూసి సీఎం సంతోషం వ్యక్తం చేశారు
మోహన్‌లాల్‌గంజ్‌లోని అటల్ ఆవాసీయ విద్యాలయానికి చేరుకున్న సీఎం యోగి ముందుగా విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాల ప్రదర్శనను తిలకించారు. స్మార్ట్ డస్ట్‌బిన్, స్మార్ట్ బ్లైండ్ స్టిక్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్, అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్, కంప్యూటర్ మోడల్, కాలిగ్రఫీ, ఆర్ట్ & క్రాఫ్ట్ వంటి పరికరాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు, వీటిని చూసిన సీఎం యోగీ విద్యార్థులను ప్రశంసించి ప్రోత్సహించారు. విద్యార్థులు తమ నమూనాల ప్రత్యేకతలను కూడా ఆయనకు వివరించారు.
ఓ విద్యార్థిని సీఎం యోగి చిత్రాన్ని గీసింది.ఇది చూసి ఎంతో సంతోషించిన ఆయన దానిపై సంతకాన్ని కూడా చేశారు. ఈ సందర్భంగా సీఎం అందరి విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు.
అక్కడి నుంచి సీఎం యోగీ నేరుగా తరగతి గదులను సందర్శించారు... విద్యార్థులను పాఠశాలలో వసతులు, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు. గతంలో ఎలాంటి విద్యను అభ్యసించారు... ఇప్పుడు జీవితంలో ఏం మార్పు వచ్చిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు యోగి. తమకు ఇప్పుడు స్మార్ట్ క్లాసుల్లో చదువుకునే అవకాశం లభిస్తోందని విద్యార్థులు తెలిపారు.
ఒకే తప్పును పదే పదే చేయకండి
ఈ సందర్భంగా సీఎం యోగీ విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేశారు. ఇటీవల లక్నోలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొని బహుమతులు అందుకున్నామని, ఢిల్లీ పరేడ్ లో కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తారా? అని ఒక విద్యార్థి అడిగాడు. దీనికి సీఎం యోగీ నవ్వుతూ తప్పకుండా పంపిస్తామని హామీ ఇచ్చారు.
మరో విద్యార్థి మీరు చదువుకునే రోజుల్లో తప్పులు చేసి శిక్ష అనుభవించారా? అని ప్రశ్నించాడు. దీనికి సీఎం ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు సూచనలు ఇస్తూ.. తెలియక తప్పులు జరిగితే ఎవరూ తప్పుపట్టరని... వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ ఒకే తప్పును పదే పదే చేయకూడదని చెప్పారు. ఒక పని చేసేటప్పుడు తప్పులు జరగడం సహజమే. కానీ పదే పదే అదే తప్పు జరిగితే అది ఉద్దేశపూర్వకంగా చేసినట్లే అవుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని సమాధానం చెప్పారు.
ప్రజల డబ్బును సద్వినియోగం చేసుకుంటున్నాం
అటల్ ఆవాసీయ విద్యాలయంలో ఏర్పాటు చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఆలోచన అని యోగి అన్నారు. ఇది ప్రజల డబ్బు... ఇది తప్పుడు చేతుల్లోకి డబ్బు వెళితే దుర్వినియోగం అవుతుంది... సరైనవారి చేతుల్లోకి వెళితే ఇలాంటి మంచి పాఠశాల నిర్మించినట్లుగా సద్వినియోగం అవుతాయన్నారు.
ఇప్పటికే 16 అటల్ ఆవాసీయ విద్యాలయాలు పూర్తయ్యాయి.. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.. మిగిలిన 57 జిల్లాల్లో కూడా వీటిని నిర్మిస్తున్నామన్నారు. దీనివల్ల వేలాది మంది పిల్లలకు మేలు జరుగుతుందన్నారు.
సరైన మార్గంలో నడిస్తే గమ్యం చేరుకుంటారు... తప్పుడు మార్గంలో వెళితే దారి తప్పుతారని సూచించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అటల్ ఆవాసీయ విద్యాలయాలకు భవనాలు, స్థలాలను కేటాయించడమే కాకుండా.. రిజిస్టర్డ్ కార్మికుల సెస్సు నిధులతో ఇక్కడి నిత్య కార్యకలాపాల నిర్వహణ కోసం ఒక కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసిందన్నారు. దీని కోసం మీరు ప్రధానమంత్రి మోదీజీకి లేఖ రాసి ధన్యవాదాలు తెలియజేయాలని విద్యార్థులకు యోగి సూచించారు.
కార్మికులు, అనాథలకు మెరుగైన భవిష్యత్తుకు నాంది
6వ తరగతి చదువుతున్న ఛవి గౌతమ్ అనే విద్యార్థిని సీఎంను ఉద్దేశించి.. పిల్లల కోసం అటల్ ఆవాసీయ విద్యాలయాలను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎప్పుడు, ఎలా వచ్చిందని ప్రశ్నించింది.
దీనికి సీఎం యోగి స్పందిస్తూ.. రిజిస్టర్డ్ కార్మికుల సెస్సు నిధులను సేకరించే BOC బోర్డులో అవినీతి జరుగుతోందని ప్రధానమంత్రి మోదీజీ తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ విషయమై ఆలోచించాలని సూచించారని చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించిన తర్వాత.. మన కార్మికులు నిరంతరం పనిచేస్తూ ఉంటారని, నేడు ఒక జిల్లాలో అయితే రేపు మరో జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని గుర్తించామన్నారు. వారు తమ పిల్లలకు చదువు చెప్పించలేకపోతున్నారని, వారి కోసం ఏం చేయగలమో ఆలోచించామని చెప్పారు.
కరోనా సమయంలో అనాథలుగా మారిన పిల్లలకు కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మోదీజీ ఆలోచనను అటల్ ఆవాసీయ విద్యాలయాల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. దేశ మాజీ ప్రధాని అటల్‌జీ స్మృతులను గుర్తుంచుకుంటూ ఈ ఏర్పాటు చేశాం. మిగిలిన 57 జిల్లాల్లో కూడా వీటిని నిర్మిస్తున్నాం. దీని కోసం మనం ప్రధానమంత్రి మోదీజీకి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ చదువుకుంటున్న పేద పిల్లల తరపున అటల్ జీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని యూపీ సీఎం యోగి తెలిపారు.