డీఎండీకే చీఫ్, సినీ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత: శోక సంద్రంలో అభిమానులు

సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి చెందారు. గత కొంతకాలంగా  విజయ్ కాంత్  అనారోగ్యంతో  ఉన్నారు.

Cine actor vijayakanth passes away lns

 

చెన్నై:సినీ నటుడు,డీఎండీకే అధినేత  విజయ్ కాంత్ మృతి చెందాడు.విజయ్ కాంత్ వయస్సు 71 ఏళ్లు.ఈ విషయాన్ని  తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  విజయ్ కాంత్ గురువారం నాడు మరణించాడు.  1952 ఆగస్టు  25న విజయ్ కాంత్ జన్మించారు.  గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో ఉన్నారు. విజయ్ కాంత్  మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు  ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమిళ రాజకీయాల్లో  విజయ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు.  2005 సెప్టెంబర్  14న డీఎండీకెను విజయ్ కాంత్ ఏర్పాటు చేశారు. 

తమిళ రాజకీయాల్లో  విజయ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు.  2005 సెప్టెంబర్  14న డీఎండీకెను విజయ్ కాంత్ ఏర్పాటు చేశారు. 2006 లో తొలిసారిగా  విజయ్ కాంత్  ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఇనిక్కుం ఇలామై తో సినీ రంగంలోకి విజయ్ కాంత్ అడుగుపెట్టారు.సుమారు వందకు పైగా సినిమాల్లో విజయ్ కాంత్ నటించారు. దాదాపు 20కిపైగా సినిమాల్లో  పోలీస్ గా విజయ్ కాంత్  నటించి మెప్పించాడు.తన వందవ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయవంతం కావడంతో అభిమానులు ఆయనను కెప్టెన్ గా పిలుస్తున్నారు.విజయ్ కాంత్ అసలు పేరు నారయణన్ విజయరాజ్ ఆళగర్ స్వామి. 27 ఏళ్ల వయస్సుల్లోనే  విజయ్ కాంత్  సినీ రంగ ప్రవేశం చేశారు.  2015 వరకు విజయ్ కాంత్ సినిమాల్లో నటించారు.రాజకీయాల్లో  విజయ్ కాంత్  రాణించారు. ఒకానొక దశలో తమిళనాడు అసెంబ్లీలో డీఎండీకే  ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. అయితే  ఆ తర్వాత  ఆ పార్టీ క్రమంగా పట్టు కోల్పోయింది.  

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విజయ్ కాంత్ కు  కరోనా సోకిందని కూడ వైద్యులు ప్రకటించారు. విజయ్ కాంత్ చికిత్స పొందుతూనే కన్నుమూసినట్టుగా ఆసుపత్రి వర్గాలు  ఇవాళ ప్రకటించాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios