న్యూఢిల్లీ: తూర్పు లడ్ధాఖ్ లోని పాంగాంగ్ సో వద్ద చైనా సైనికుడు భారత భూభాగంలోకి ప్రవేశించాడు. వాస్తవాధీన రేఖను దాటుకొని ఇండియాలోకి ప్రవేశించిన చైనా జవాన్ ను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకొంది.

చైనా సైనికుడు చీకటి, సంక్లిష్టమైన భౌగోళిక కారణంగా ఆయన దారితప్పి ఇండియాలోకి వచ్చినట్టుగా చైనా ప్రకటించింది.చైనా ఆర్మీ జవాన్ ఇండియాలోకి ప్రవేశించడం వెనుక గూఢచార్య ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

తమ జవాన్ ను సురక్షితంగా విడుదల చేయాలని చైనా  ఆర్మీ అధికారులు ఇండియాను కోరారు. చైనా ఆర్మీ ఈ మేరకు  ఓ ప్రకటన విడుదల చేసింది. తూర్పు లడఖ్ లోని పంగోంగ్ యొక్క దక్షిణ ఒడ్డున చైనా జవాన్ ను ఇండియన్ ఆర్మీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. 

గత ఏడాది చివరి నుండి భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద గతంలో చైనా, ఇండియా ఆర్మీ మధ్య ఘర్షణ చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.