ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం పట్టివేత

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 12, Jan 2019, 12:26 PM IST
Chennai: 2 Korean women held for smuggling 24 kg gold
Highlights

 ఈ బంగారం ఖరీదు రూ.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దాదాపు 24కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.  ఇద్దరు ప్రయాణికులు ఈ 24కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా... అధికారులు పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ఖరీదు రూ.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి (ఏఐయూ) చెందిన కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టి భారీ మొత్తంలో బంగారాన్ని సీజ్‌ చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణా కొరియాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు హాంకాంగ్‌ నుంచి చెన్నైకు వచ్చారు. ఈ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

loader