వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన అనేక పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వైవాహిక అత్యాచారం అనే విషయం సామాజిక, చట్టపరమైన చిక్కులతో ముడి పడి ఉందని.. దీనిమీద అంత తొందరగా ఓ నిర్ణయాన్ని తీసుకోలేమని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

ఢిల్లీ : ‘Marital rape’ అంశంపై కేంద్ర ప్రభుత్వం Delhi High Courtకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. నాగరిక సమాజానికి మూలస్తంభం, పునాది అయిన womenల స్వేచ్ఛ, గౌరవం, హక్కులను పరిరక్షించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే విషయమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహా సంబంధీకులందరితో అర్థవంతమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు చేపట్టాల్సి ఉందని పేర్కొంది.

సామాజిక, చట్టపరమైన చిక్కులతో ముడిపడిన ఈ అంశంపై సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలరని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించిన విచారణను వాయిదా వేయాలంటూ Additional affidavitను దాఖలు చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించి, దోషులను శిక్షించాలని కోరుతూ ఆల్ ఇండియా democratic women's association, ఆర్ఐటి పౌండేషన్ లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశాయి. భారత శిక్షాస్మృతిలోని 375 నిబంధన నుంచి భర్తలకు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ రాజీవ్ శక్ ధర్, జస్టిస్ సి. హరిశంకర్ ల ధర్మాసనం విచారణ చేపడుతోంది.

ఇదిలా ఉండగా, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన అనేక పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణలు జరుగుతున్నాయి. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం.. భార్యలపై అత్యాచారం చేసిన నేరానికి సంబంధించి ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ ఒక బ్యాచ్ పిటిషన్లను విచారిస్తోంది. పిటిషనర్లు తమ భర్తలచే లైంగిక వేధింపులకు గురైన వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సెక్షన్ 375 IPC (రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపు రాజ్యాంగబద్ధతను సవాలు చేశారు.

కాగా, ఫిబ్రవరి 2న దీనిమీద పార్లమెంట్ లో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మహిళలు, పిల్లలను రక్షణ క‌ల్పించ‌డం అందరికీ ముఖ్యమైన విషయమేనని, అయితే ప్రతి వివాహాన్ని హింసాత్మకంగా, ప్రతి పురుషుడుని రేపిస్ట్‌గా విమర్శించడం సరైనది కాద‌నీ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. 

బుధవారం రాజ్యసభలో వైవాహిక అత్యాచారంపై సీపీఐ నేత బినయ్ విశ్వం అడిగిన అనుబంధ ప్రశ్నకు మంత్రి స్మృతి ఇరానీ బ‌దులిచ్చారు. మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని తెలిపారు. అయితే ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించాలని చెప్పడం సరైనది కాదన్నారు. గృహ హింస నిర్వచనంపై.. గృహహింస చట్టంలోని సెక్షన్ 3తో పాటు అత్యాచారంపై ఐపీసీ సెక్షన్ 375ని ప్రభుత్వం పరిశీలించిందా? లేదా? అని తెలుసుకోవాలని కోరుకుంటున్నాని పార్ల‌మెంట్ బినయ్ విశ్వం ప్ర‌శ్నించారు. 

బినయ్ విశ్వం ప్ర‌శ్నపై స్మృతి ఇరానీ స్పందిస్తూ..ఈ దేశంలో ప్రతి పెళ్ళినీ ఓ దౌర్జన్యపూరితమైన పెళ్లిగానూ, ఈ దేశంలోని ప్రతి పురుషుడినీ ఓ రేపిస్ట్‌గానూ ఈ గౌరవప్రదమైన సభలో విమర్శించడం సరైనది కాదని అన్నారు. ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న అంశంపై వివరణాత్మకంగా మాట్లాడటానికి రాజ్యసభ నిబంధనావళిలోని రూల్ 47 ప్రకారం అనుమతి లేదని సీనియర్ సభ్యునికి తెలుసునన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలోని మహిళలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రయత్నమని ఆమె అన్నారు. ప్రస్తుతం, భారతదేశం అంతటా 30కి పైగా హెల్ప్‌లైన్‌లు పనిచేస్తున్నాయనీ, ఇవి 66 లక్షల మంది మహిళలకు సహాయం చేశాయి. వీటి ద్వారా దాదాపు 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని చెప్పారు. అదేవిధంగా 703 వన్ స్టాప్ సెంటర్ల ద్వారా 5 లక్షల మందికిపైగా మహిళలు సహాయం పొందారని తెలిపారు. దేశంలో జరిగే ప్రతి వివాహాన్ని హింసాత్మకంగా వివాహంగా వ‌ర్ణించడం స‌రికాద‌ని మరోసారి పునరుద్ఘాటించారు.