ఢిల్లీలో హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి చిప్స్ ప్యాకెట్లను పేదలకు ఆహారంగా అందించారు

కరోనా సమయంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు లాక్ డౌన్ కూడా విధించడంతో సామాన్యులు, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు తిండి కోసం కూడా అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, వాలంటీర్స్ కొందరు ముందుకు వచ్చి పేదలకు ఆహారాన్ని అందిస్తూ ఈ కష్టకాలంలో ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి. 

Scroll to load tweet…

తాజాగా కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఢిల్లీలో ఆహారాన్ని అందించే సేవా హీ సంఘటన్ కి ఆహరం అందజేయబడింది. ఆహరం అందించడం మంచి పని. కానీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా... ఆయన అందించింది చిప్స్, డోరిటోస్ ప్యాకెట్లు. దానితో సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. 

Scroll to load tweet…

ఇలాంటి కరోనా కాలంలో పౌష్టికాహారం అందించాలి కానీ ఇలాంటి ఆహార పదార్థాలను అందించడం అవసరమా అని నెటిజెన్ల ప్రశ్నిస్తున్నారు. ఈ ఫోటోలను స్వయంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ట్వీట్ చేసారు. దీనితో దీని పై నెటిజెన్ల విరుచుకుపడుతుంటే... మరికొందరేమో పేదలు చిప్స్ తినకూడదా అంటూ రివర్స్ లో ఫైర్ అయ్యారు.

Scroll to load tweet…

మొత్తంగా చేతుల మీదుగా అందించినందుకు కిషన్ రెడ్డి ని సైతం ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు. ఇక కొందరైతే మేక్ ఇన్ ఇండియాను పక్కకు పెట్టి విదేశీ చిప్స్ ప్యాకెట్లు ఇవ్వడమేంటి లిజ్జత్ పాపడ్స్ ఇస్తే బాగుండేది కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

Scroll to load tweet…