New Delhi: బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టాన్ని సవరించే బిల్లును లోక్ సభలో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బిల్లు పాలనను బలోపేతం చేయడానికి, ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి, పర్యవేక్షణ యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి, బహుళ-రాష్ట్ర సహకార సంఘాలలో  సంబంధాల‌ను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించి, దాడి చేస్తున్నందున దీనిని పునఃపరిశీలించాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Parliament Session: బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టాన్ని సవరించే బిల్లును లోక్ సభలో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బిల్లు పాలనను బలోపేతం చేయడానికి, ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి, పర్యవేక్షణ యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి, బహుళ-రాష్ట్ర సహకార సంఘాలలో సంబంధాల‌ను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు-2022 ను సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష ఎంపీల డిమాండ్ల మధ్య లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టారు. 

పాలనను బలోపేతం చేయడం, ఎన్నికల ప్రక్రియను సంస్కరించడం, పర్యవేక్షణ యంత్రాంగాన్ని మెరుగుపరచడం, బహుళ-రాష్ట్ర సహకార సంఘాలలో సంబంధాల‌ను సులభతరం చేయడానికి సహకార శాఖ సహాయ మంత్రి (సహాయ మంత్రి) బిఎల్ వర్మ ప్రవేశపెట్టిన మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు-2022 తీసుకువ‌చ్చారు. అయితే, ఈ బిల్లులోని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.

 'కోఆపరేటివ్ సొసైటీ అనేది రాష్ట్ర విషయం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల భూభాగాన్ని ఆక్రమిస్తున్నదనడానికి స్పష్టమైన సూచన ఉంది, అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తుతున్నాయి" అని లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకార సమాఖ్య విధానానికి పిలుపునిస్తుందన్న ఆయ‌న‌.. ఈ బిల్లు తయారీకి ముందు దీనిని అనుసరించాల్సిందని పేర్కొన్నారు. "ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ అధికార కేంద్రీకరణకు దారితీయవచ్చు. ఇది బహుళ-రాష్ట్ర సహకార సంఘం స్వయంప్రతిపత్తి, పనితీరును ప్రభావితం చేస్తుంది. అధికార దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుందని" అన్నారు. రాష్ట్ర భూభాగం చిక్కులు, ఆక్రమణల దృష్ట్యా, ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాల‌ని ఆయ‌న అన్నారు.

డీఎంకే నాయకుడు ఆర్ బాలు కూడా అదే ధోరణిలో మాట్లాడారు. ఈ బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయనీ, ఇది రాజ్యాంగంలో పొందుపరచిన సహకార సంఘాల నిర్వచన స్ఫూర్తికి విరుద్ధమని విప్లవ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పి) నాయకుడు ఎన్ కే. ప్రేమచంద్రన్ అన్నారు. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించివేయడానికి ప్రయత్నిస్తుందనీ, ఇది దేశంలోని సమాఖ్య నిర్మాణానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. ప్రతిపాదిత చట్టంలోని కొన్ని నిబంధనలు సహకార సంఘాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయనీ, బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 43బిలో పేర్కొన్న విధంగా సహకార సంఘాలపై అదనపు భారం పడుతుందనీ, స్వయంప్రతిపత్తితో పనిచేసే ప్రధాన సూత్రాన్ని ఉల్లంఘిస్తాయని ఆయన అన్నారు. ఆర్టికల్ 43బి ప్రకారం సహకార సంఘాల స్వచ్ఛంద ఏర్పాటు, స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్య నియంత్రణ, వృత్తిపరమైన నిర్వహణను ప్రోత్సహించడానికి రాష్ట్రం కృషి చేస్తుందన్నారు. 

మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు-2022 ఉపసంహరించుకోవాలి. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించి, దాడి చేస్తున్నందున దీనిని పునఃపరిశీలించాలి : కాంగ్రెస్ నాయ‌కుడు మ‌నీష్ తివారీ 


 కాగా, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు-2022 సభ పరిధిలోనే ఉందనీ, గతంలో కూడా అనేక సందర్భాల్లో సవరణలు ప్రవేశపెట్టామని కేంద్ర‌ మంత్రి ఎస్ వర్మ తెలిపారు.