Asianet News TeluguAsianet News Telugu

Breaking News: CDS Rawat chopper crash ప్ర‌మాదానికి కారణ‌మ‌దే..దర్యాప్తులో తేలిన సంచలన వాస్తవాలు

CDS Rawat chopper crash : వాతావరణంలో ఊహించని మార్పు వ‌ల్ల‌నే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat) విమాన ప్ర‌మాదానికి జ‌రిగింద‌ని ట్రై-సర్వీసెస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ తేల్చి చెప్పింది. ప్రమాదానికి ఎలాంటి యాంత్రిక వైఫల్యం గానీ  నిర్లక్ష్యం లేద‌ని తోసిపుచ్చింది. 

CDS Rawat chopper crash was result of entry into clouds, says preliminary probe report
Author
Hyderabad, First Published Jan 14, 2022, 8:03 PM IST

CDS Rawat chopper crash : గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat) విమాన ప్ర‌మాదంలో దుర్మార‌ణం పాలైన విష‌యం తెలిసిందే. ఈ వివాదం యావ‌త్తు దేశాన్ని క‌లిచివేసింది. ఈ క్ర‌మంలో  అనేక అనుమానాలు వచ్చాయి. ఈ త‌రుణంలో ఎలాంటి వదంతులు వ్యాపింపిజేయవద్దని ఆర్మీ(Indian Army) కూడా కోరింది.  ఈ ఘటనపై భారత వైమానిక దళం(Air Force) దర్యాప్తు చేస్తున్నది. ఈ ఘ‌ట‌న‌పై ట్రై-సర్వీసెస్ కోర్ట్ ద‌ర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించింది. తాజాగా  నివేదికలో సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ సారథ్యంలో సాగుతున్న కోర్టు ఎంక్వైరీ.. సంచ‌ల‌న వాస్త‌వాలను బ‌య‌ట‌పెట్టింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్  మార్గం తప్పింద‌ని వివరించింది. దీంతో   విమానం అననకూల ప్రాంతానికి దూసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. Mi-17 V5 విమాన ప్ర‌మాదానికి ఎలాంటి సాంకేతిక పొరపాట్లు, మెకానికల్ లోపాలేవ‌ని తేల్చి చెప్పింది. వాతావరణం లో ఊహించని మార్పు వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెల్చింది. అలాగే.. ఈ ప్ర‌మాదానికి ఎలాంటి నిర్లక్ష్యం లేద‌ని తోసిపుచ్చింది. 

ప్రాథమిక ద‌ర్యాప్తు ప్రకారం.. లోయలో వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా మేఘాలు విమానానికి అడ్డు రావ‌డంతో ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌తో పైలట్ అయోమయానికి గుర‌య్యార‌ని, త‌త్ఫ‌లితంగా ఫైల‌ట్ విమానంపై నియంత్రిత కొల్పోయాడ‌ని నివేదిక తెలిపింది.  

ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ల‌ను క్షుణంగా విశ్లేషించి ఈ నివేదికను త‌యారు చేసిన‌ట్టు విచారణ బృందం పేర్కొంది. అంతేకాకుండా ప్రమాదాని చూసిన ప్ర‌త్యేక్ష‌ సాక్షులందరినీ ప్రశ్నించిన‌ట్టు తెలిపింది. ఈ ఫ‌లితాల‌ను అన్నింటిని క్రోడీకరించిన పిమ్మ‌ట ఈ నివేదిక‌ను వెల్ల‌డించిన‌ట్లు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ తెలిపింది. 

(మ‌రిన్ని వివరాల‌ను త్వ‌ర‌లో అప్డేట్ అవుతాయి...) 
 

Follow Us:
Download App:
  • android
  • ios