Asianet News TeluguAsianet News Telugu

కారు నెంబర్ ప్లేటు మీద వైఎస్ జగన్ పేరు...జరిమానా..

ఎటువంటి వాహనాలకైనా నంబర్ ప్లేట్ లలో అంకెలు స్పష్టంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. శుక్రవారం బెంగళూరులో ఓ కారు నంబర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పేరు వచ్చేలా ఏర్పాటు చేసుకోవడంతో బెంగళూరు పోలీసులు జరిమానా విధించారు. 

Car owner fined for putting initials of Andhra CM's name on number plate - bsb
Author
Hyderabad, First Published Jul 3, 2021, 12:48 PM IST

ఎటువంటి వాహనాలకైనా నంబర్ ప్లేట్ లలో అంకెలు స్పష్టంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. శుక్రవారం బెంగళూరులో ఓ కారు నంబర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పేరు వచ్చేలా ఏర్పాటు చేసుకోవడంతో బెంగళూరు పోలీసులు జరిమానా విధించారు. 

వెంటనే సదరు బోర్డును మార్చాలని ఆదేశించారు. నగరంలో ఏపీ39-జీజీ451 నంబరు గల కారుకు బోర్డు సక్రమంగా లేనందున తూర్పు ట్రాఫిక్ విభాగం డీసీపీ శాంతరాజ్ నేతృత్వంలో వాహనా తనిఖీ సమయంలో గుర్తించారు. 

451 నంబరును YSJ వచ్చేలా రాసుకున్నారు. వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్ ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. మోటారు వాహనాల చట్ట నిబంధనల కింద ఇలా రాసుకోవడం నేరమని సూచించిన అధికారులు వెంటనే నంబరు ప్లేటును మార్చాలని ఆదేశించారు. 

అంతేకాదు దీనికి జరిమానా విధించినట్లు కేఆర్ పుర ట్రాఫిక్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ఎంఎ మహహ్మద్ తెలిపారు. కారు యజమాని వైఎస్ జగన్ అభిమానిగా గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios