కేరళలో ఆర్టీసీకి చెందిన బస్సు సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 50 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో ఐదుగిరి పరిస్థితి విషమంగా ఉంది.
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్‌టీసీ) కు చెందిన బస్సు సోమవారం ప్రమాదానికి గురైంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో కాలువలో పడిపోయింది.ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించారు. మరో 50 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కొండ జిల్లా చీయప్పర, నెరియమంగళం మధ్య ఒక ప్రదేశంలో ఉదయం జరిగిందని అధికారులు తెలిపారు.
ఉత్తర భారతంలో భారీస్థాయిలో ఎన్ఐఏ దాడులు.. మూసేవాలా హత్య నేపథ్యంలో గ్యాంగ్ స్టర్లపై ఉక్కుపాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకులం నుంచి మున్నార్‌కు వెళ్తున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తుండగా టైర్ పగిలిపోవడంతో కాలువలో పడింది. అయితే చెట్టును ఢీకొట్టడంతో ఆగిపోవడంతో కింద లోతైన వాగులో పడలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాగా బస్సుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో 60 మంది ఉన్నారని బస్సు కండక్టర్ సుభాష్ తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎదురుగా వచ్చిన వాహనం బస్సును ఢీకొట్టిందని డ్రైవర్ చెప్పాడు. భారీ వర్షం కురుస్తున్నందున సరిగా కంట్రోల్ కాలేదు” అని సుభాష్ పీటీఐకి తెలిపారు.
ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి సంజీవన్ (33)గా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ ఎర్నాకులంలోని కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
