హోరెత్తనున్న గులాబీ ప్రచారం.. 54 అసెంబ్లీ సెగ్మెంట్లకు నియమించిన ఇంఛార్జిలు వీరే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉంటే.. అధికార బీఆర్‌ఎస్ మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ప్రచార పర్వానికి రసవత్తరంగా మార్చేందుకు వ్యూహారచన చేస్తోంది. ఈ నేపథ్యంలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జీలను నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జిలతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అఖండ విజయాన్ని సాధించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతోంది. గత 10 ఏళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ఓటర్లతో పార్టీ అభ్యర్థులు కనెక్ట్ ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌ల తొలి జాబితాను విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించడంలో ఇన్‌ఛార్జ్‌లుగా నియమితులైన పార్టీ సీనియర్ నేతలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.
ఈ సందర్భంలో (టెలికాన్ఫరెన్స్) లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఉందని దీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజల ద్రుష్టికి తీసుకవెళ్లాలని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని తెలిపారు. పార్టీ ఇన్‌చార్జులు బీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాల సందేశాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు.
ప్రతిపక్షాలు ఎన్నికలను తరచూ వాగ్దానాలకు వేదికలుగా ఉపయోగించుకుంటున్నాయని, గత దశాబ్దంలో తెలంగాణలో సాధించిన అద్భుతమైన అభివృద్ధిని ప్రదర్శించడానికి BRS అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి లబ్ధిదారుడికి చేరవేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను వారికి అప్పగించారు. పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రచార బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని వారికి సూచించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వచ్చే 45 రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని పార్టీ ఇన్‌ఛార్జ్‌లను కోరారు. పార్టీ అభ్యర్థులకు అన్ని విధాలా సహకారం అందించాలని, బూత్ స్థాయి కమిటీల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ప్రచారం సజావుగా జరిగేలా సమగ్ర ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ అవకాశాలపై నమ్మకంతో ఉండాలని వారికి సూచించారు. బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతం కంటే అత్యధిక స్థానాలను గెలిచేందుకు కృషి చేయాలన్నారు
బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలు వీరే..
1. బెల్లంపల్లి – ఎంపీ వెంకటేశ్ నేత
2. మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్రసాద్
3. ఖానాపూర్ – ఎమ్మెల్సీ దండె విఠల్
4. బోథ్ – మాజీ ఎంపీ నగేశ్
5. ముదోల్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
6. బోధన్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
7. ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్
8. కామారెడ్డి – ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్
9. నిజామాబాద్ అర్బన్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
10. జగిత్యాల – ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్
11. రామగుండం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్
12. మంథని – ఈద శంకర్ రెడ్డి
13. పెద్దపల్లి – చైర్మన్ రవీందర్ సింగ్
14. చొప్పదండి – మంత్రి గంగుల కమలాకర్
15. వేములవాడ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
16. మానకొండూరు – సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ
17. మెదక్ – కే తిరుపతి రెడ్డి
18. ఆందోల్ – మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్
19. నర్సాపూర్ – ఎమ్మెల్సీ వెంకటరాం రెడ్డి
20. జహీరాబాద్ – మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్రసాద్
21. సంగారెడ్డి – చైర్మన్ వీ భూపాల్ రెడ్డి, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
22. దుబ్బాక – చైర్మన్ బాలమల్లు
23. గజ్వేల్ – మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, చైర్మన్ ప్రతాప్ రెడ్డి
24. మల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
25. ఉప్పల్ – చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
26. ఇబ్రహీంపట్నం – మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి
27. చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి
28. వికారాబాద్ – ఎంపీ రంజిత్ రెడ్డి
29. ముషీరాబాద్ – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్
30. అంబర్‌పేట్ – కట్టెల శ్రీనివాస్ యాదవ్, అడ్వకేట్ మోహన్ రావు
31. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
32. మక్తల్ – చైర్మన్ ఆంజనేయులు గౌడ్
33. గద్వాల్ – మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమళ్ల
34. అలంపూర్ – ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి
35. అచ్చంపేట – చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్
36. కల్వకుర్తి – చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
37. కొల్లాపూర్ – ఎంపీ రాములు
38. నాగార్జున సాగర్ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామచంద్ర నాయక్
39. హుజుర్ నగర్ – విజయసింహా రెడ్డి
40. కోదాడ – ఎమ్మెల్సీ టీ రవీందర్ రావు
41. నల్లగొండ – జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి
42. నకిరేకల్ – ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
43. జనగామ – మాజీ ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు, చైర్మన్ రాజయ్య, మంత్రి హరీశ్‌రావు
44. మహబూబాబాద్ – మంత్రి సత్యవతి రాథోడ్
45. నర్సంపేట – చైర్మన్ వీ ప్రకాశ్
46. వరంగల్ ఈస్ట్ – మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
47. భూపాలపల్లి – ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
48. ములుగు – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
49. ఇల్లందు – ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
50. మధిర – మంత్రి పువ్వాడ అజయ్, కొండబాల కోటేశ్వర్ రావు
51. వైరా – ఎంపీ నామా నాగేశ్వర్ రావు
52. సత్తుపల్లి – ఎంపీ పార్థసారథి రెడ్డి
53. అశ్వరావుపేట – శేషగిరావు(ఖమ్మం డీసీఎంఎస్)
54. భద్రాచలం – ఎమ్మెల్సీ తాత మధు