మధ్యప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. అన్నాచెల్లెళ్లను చెట్టుకు కట్టి విచక్షణారహితంగా చావబాదారు గ్రామస్తులు. పోలీసులు వచ్చే వరకు అన్నాచెల్లెళ్లను కొడుతూనే వున్నారు గ్రామస్తులు.
మధ్యప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. అన్నాచెల్లెళ్లను చెట్టుకు కట్టి విచక్షణారహితంగా చావబాదారు గ్రామస్తులు. కారణం వీరిద్దరి క్యారెక్టర్‌పై అనుమానం రావడమే. వివరాల్లోకి వెళితే.. ఖాండ్వా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు తన చెల్లెలు కళావతిని చూసేందుకు బామండా గ్రామానికి వచ్చి.. పెరట్లో ఒకే మంచంపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆ సమయంలో బాధితురాలి భర్త ఇంట్లో లేడు. ఈ క్రమంలో వీరిద్దరిని చూసిన కొందరు గ్రామస్తులు లేనిపోని అనుమానంతో అన్నాచెల్లెళ్ల మధ్య ఏదో బంధం వుందన్నట్లుగా పుకార్లు పుట్టించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు వీరిద్దరిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చావబాదారు. ఇంత జరుగుతున్నా అక్కడున్న ఏ ఒక్కరూ దీనిని అడ్డుకోకపోగా.. సెల్‌ఫోన్‌లతో వీడియో తీశారు. దీనిపై బంధువులకు సమాచారం అందడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే వరకు అన్నాచెల్లెళ్లను కొడుతూనే వున్నారు గ్రామస్తులు. అనంతరం వీరిద్దరిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ అమానుష ఘటనకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.
