తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లాలో బాణాసంచాతో వెళుతున్న వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపించడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదేరకమైన ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడులో ఓ బాణాసంచా కార్మాగారంలో భారీ పేలుడు చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలవ్వగా.. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి.. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.