నడిరోడ్డుపై  పట్టపగలు..ఓ మైనర్ బాలికపై .. కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కాగా.. అతని దుశ్చర్యు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ బ్రేకులు వేశాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..  బాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆసిఫ్ రషీద్ మెహతా ముంబయి నగరంలోని మహిమ్ ప్రాంతంలోని తన ఇంటికి పని ముగించుకొని వస్తుండగా.. ఒక వీధిలో 20ళఏళ్ల యువకుడు ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. తన ద్విచక్రవాహనం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఓ బాలికకు తన మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియో చూపిస్తూ ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. తన ప్యాంటు జిప్ తీసి బాలికను అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించడం కనిపించింది. 

అంతే స్టంట్ మాస్టర్ ఆసిఫ్ రషీద్ వచ్చి కామాంధుడైన యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించి బాలికను కాపాడాడు. ఈ ఘటనను సైతం వీడియో తీసిన స్టంట్ మాస్టర్ దాన్ని పోలీసులకు అప్పగించాడు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేర పోలీసులు కామాంధుడైన యువకుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. కామాంధుడిని పట్టిచ్చిన స్టంట్ మ్యాన్ ను స్థానికులు అభినందించారు.