Asianet News TeluguAsianet News Telugu

చెన్నై బీచ్‌లో నీలిరంగు అలలు... సంబరపడొద్దంటున్న నిపుణులు

ఆదివారం రాత్రి చెన్నై బీచ్‌‌లో అలలు నీలిరంగుతో మెరిసిపోయిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఇది ప్రకృతి అందం కాదని...భారత సముద్ర తీరానికి ఓ హెచ్చరిక లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

blue glow on chennai beach
Author
Chennai, First Published Aug 20, 2019, 8:02 AM IST

ఆదివారం రాత్రి చెన్నై బీచ్‌‌లో అలలు నీలిరంగుతో మెరిసిపోయిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఇది ప్రకృతి అందం కాదని...భారత సముద్ర తీరానికి ఓ హెచ్చరిక లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయో లుమినిసెన్స్‌గా పేర్కొనే ఈ పరిణామం... సముద్రంలోని నోక్టిలూకా సింటిలియన్స్ అనే సూక్ష్మజీవుల కారణంగా ఏర్పడుతుందట. భారత సముద్రతీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే బయో లుమినిసెన్స్.. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయిన చోట మాత్రమే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

ఈ సూక్ష్మజీవులు ఉన్న చోటు చేపలు బతకలేవని...అందువల్ల దీనిని ఒక ముందస్తు హెచ్చరికగానే భావించాలని వారు హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios