Asianet News TeluguAsianet News Telugu

హ్యాకైన బీజేపీ వెబ్ సైట్... మోదీపై ట్రోల్స్

భారతీయ జనతాపార్టీ( బీజేపీ) కి చెందిన అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైంది. ఈ విషయాన్ని గమనించిన వెబ్ సైట్ నిర్వాహకులు.. సైట్ ని నిలిపివేశారు.

BJP Website Down After Being Allegedly Hacked
Author
Hyderabad, First Published Mar 5, 2019, 1:07 PM IST

భారతీయ జనతాపార్టీ( బీజేపీ) కి చెందిన అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైంది. ఈ విషయాన్ని గమనించిన వెబ్ సైట్ నిర్వాహకులు.. సైట్ ని నిలిపివేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. బీజేపీ వెబ్ సైట్ ని హ్యాక్ చేసిన కొందరు.. మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం విశేషం. మోదీ దేశ ప్రజలను మోసం చేశారనే అర్థం వచ్చేలా మీమ్స్ క్రియేట్ చేసి ఆ వెబ్ సైట్ లో పెట్టారు. దీంతో.. దానిని గమనించిన కొందరు సోషల్ మీడియా యూజర్లు వెబ్ సైట్ కి రిపోర్టు చేశారు.

ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకు చెందిన మేమ్స్‌ను పోస్ట్ చేశారని సదరు యూజర్లు వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు. సోదరసోదరీమణులారా.. నేను మిమ్మల్ని ఫూల్‌ను చేశాను.. మీ అందరినీ ఫూల్‌లను చేశాను. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి అని మోదీ అన్నట్లుగా ఈ మేమ్స్ పోస్ట్ చేయడం విశేషం. 

దీంతో వెంటనే స్పందించిన బీజేపీ తమ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపేసింది. ప్రస్తుతం ఆ సైట్‌ను తెరవడానికి ప్రయత్నిస్తుంటే.. ప్రస్తుతం మెయింటెనెన్స్ పని నడుస్తున్నదని, త్వరలోనే తిరిగి మీ ముందుకు వస్తామన్న సందేశం కనిపిస్తున్నది. గత నెలలో చత్తీస్‌గఢ్ బీజేపీకి చెందిన వెబ్‌సైట్ కూడా హ్యాకింగ్‌కు గురైంది. అందులో పాకిస్థాన్ జెండా కనిపించడం అప్పట్లో దుమారం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios