Asianet News TeluguAsianet News Telugu

బైక్ స్టంట్‌.. ముందు టైర్ గాలిలో.. దూసుకెళ్లి ట్యాంకర్‌ను ఢీకొట్టిన బైకర్.. వీడియో వైరల్

డివైడర్ లేని ఆ రోడ్డుపై బైక్ ముందు టైర్‌ను గాల్లోకి లేపి స్టంట్ చేశాడు. కొంత దూరం సక్సెస్‌ఫుల్‌గా బైక్‌ను కంట్రోల్ చేయగలిగాడు. కానీ, ల్యాండింగ్‌లో పొరపాటు జరిగింది. బైక్‌పై ఆ వాహనచోదుకుడు కంట్రోల్ కోల్పోయాడు. అంతే.. ఆ బైక్ అదే వేగంతో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

bike stunt goes wrong biker collided with tanker in viral video
Author
New Delhi, First Published Oct 31, 2021, 2:36 PM IST

న్యూఢిల్లీ: యాక్షన్ సినిమాల్లో Bike Stunts చూసి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దిమ్మదిరిగే స్టంట్‌లతో అవి ఆకట్టుకుంటాయి. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ మీదకు దూకేస్తుంటారు. ఇవన్నీ చాలా సహజంగా.. సులభసాధ్యమైన సాహసాలుగా కనిపిస్తుంటాయి. కానీ, అవన్నీ నైపుణ్యవంతుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. ఇవే స్టంట్‌లను నిజ జీవితంలోనూ వేయాలని యువత ఉవ్విళ్లూరుతుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా నేరుగా ప్రదర్శనలు చేస్తుంటారు. ఇంకొందరు Social Mediaలో Viral కావాలని, లైక్‌లు సంపాదించాలని, ఇలా Bike Racingలు, స్టంట్‌లు చేసి ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతున్నది.

మోటార్ బైక్‌పై ఒక వ్యక్తి ముందు వెళ్తుంటే ఆయనను వెనుక ఒక Carలో వెంబడిస్తూ షూట్ చేశారు. ఆ టూవే రోడ్డులో బైకర్ వెళ్తున్న వైపు వాహనాలు పెద్దగా ఏమీ లేవు. కానీ, అటువైపు వాహనాలు రద్దీగా ఉన్నాయి. అదీగాక రోడ్డుపై అక్కడ డివైడర్ కూడా లేదు. ఆ వాహన చోదుకుడు ఫుల్ బైకర్ అటైర్‌లో ఉన్నారు. ఆయన హెల్మెట్‌పై గోప్రో కెమెరా కూడా అమర్చుకున్నారు. 

ఇలాంటి ప్రాంతంలో బైకర్ స్టంట్ మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ముందు టైర్ గాలిలోకి లేపి వేగంగా దూసుకెళ్లాడు. చాలా దూరంగా విజయవంతంగా తీసుకెళ్లాడు. మరికొంత దూరంలో ట్యాంకర్ ఉండగా బైక్ ముందు టైర్‌ను మళ్లీ రోడ్డపై దింపాడు. కానీ, ఆ ల్యాండింగ్ సరిగా కాలేదు. అంతే బైక్ గింగిరాలు తిరుగుతూ ముందుకు వెళ్లింది. ఆ వాహనచోదుకుడు బైక్‌పై తన నియంత్రణ కోల్పోయాడు. నేరుగా ఆ బైక్ ఎదురుగా వస్తున్న Tankerను ఢీకొట్టింది. బైక్ ఒక్కసారిగా ఎగిరిపడింది. శిథిలాలు దూరంలో ఎగిరిపడ్డాయి. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు అర్థమవుతున్నది.

Also Read: వరల్డ్ రికార్డ్ కోసం బైక్ స్టంట్... చివరకు..!

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. జాగ్రత్తగా ఉండండని పేర్కొంటూ ఇలాంటి స్టంట్‌లు చేయవద్దని హెచ్చరించారు. అలాంటి స్టంట్లు చేసి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు.

ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది. చాలా మంది కామెంట్లు చేశారు. రేసింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్స్ ఉంటాయని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. ఒకవేళ ఎవరికైనా నిజంగా రేసింగ్‌పై మక్కువ ఉంటే అలాంటి ట్రాక్స్‌పై స్టంట్లు చేసుకోవాలని సూచించారు. కానీ, ఇలా పబ్లిక్ రోడ్లపై స్టంట్లు చేయవద్దని పేర్కొన్నారు. ఆ బైకర్ తల్లిదండ్రుల పరిస్థితిని పేర్కొంటూ బాధను వ్యక్తపరిచారు. ఒక్క నిమిషం సరదా కోసం అందరినీ శోకసంద్రంలోకి నెట్టేయడం బాధాకరమని ట్వీట్ చేశారు.

ఇలాంటి తీరులోనే అమెరికాలో ఓ ఘటన జరిగింది. అమెరికాకు చెందిన అలెక్స్ హార్విల్(28) అనే వ్యక్తి స్టంట్ మ్యాన్ గా విధులు నిర్వహించేవాడు. కాగా... అలెక్స్ కి ఎప్పటి నుంచో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలో.. హ్వార్విల్ 351 అడుగుల నుంచి జంప్ చేసి గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టాలని అనుకున్నాడు. 

Also Read: హోండా బైక్ తో హాలీవుడ్ స్టార్ హీరో స్టంట్.. వీడియో వైరల్..

దీని కోసం మోటార్‌ సైకిల్‌ రాంప్‌ ఏర్పాటు చేసి, ఓ మట్టి దిబ్బపై జంప్‌ చేయడానికి ప్రయత్నించాడు . ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన  హాలెక్స్‌  అక్కడే కుప్పకూలి చనిపోయాడు. స్టంట్ మాన్ అలెక్స్ హార్విల్ మరణం డర్ట్ బైక్ జంపింగ్ డేర్ డెవిల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios