Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో మంత్రి కుమారుడి కాల్పుల కలకలం.. నలుగురు చిన్నారులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం..

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా  మా గ్రామంలో బిజెపి నేత రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి నారాయణ ప్రసాద్ ఇలా ఉంది.  ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు అయితే అక్కడ ఆడకూడదని తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లు ప్రసాద్తో పాటు అతడి ఇంటి సిబ్బంది పిల్లలను మొదట హెచ్చరించారు ఎందుకు వారు నిరాకరించగా కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది
 

 

Bihar minister's son opens fire to chase away children playing cricket on his farm
Author
Hyderabad, First Published Jan 24, 2022, 6:43 AM IST

పాట్నా :  minister ఇంటి సమీపంలో ఉన్న Mango orchardలో పిల్లలతో పాటు కొందరు యువకులు చేరి cricket ఆడటం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మంత్రి కుమారుడు, సిబ్బందితో కలిసి వారిపై దాడికి దిగాడు. ఆ తర్వాత తుపాకీతో firingకు తెగబడ్డాడు. ఆ దాడిలో నలుగురు children తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Bihar లోని పశ్చిమ చంపారన్ జిల్లా హర్దియా గ్రామంలో బిజెపి నేత రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి Narayan Prasad ఇలా ఉంది.  ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే అక్కడ ఆడకూడదని తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లు ప్రసాద్తో పాటు అతడి ఇంటి సిబ్బంది పిల్లలను మొదట హెచ్చరించారు. ఇందుకు వారు నిరాకరించగా.. కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

అక్కడి నుంచి వెళ్లిపోయిన బబ్లూ..ఆ తర్వాత నాలుగు వాహనాల్లో తన అనుచరులను తీసుకువచ్చి వారిపై దాడికి దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన బబ్లూ ప్రసాద్.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అనుచరులు జరిపిన దాడిలో నలుగురు పిల్లలు గాయపడ్డారు. దాడి, కాల్పులు గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. అంతా కలిసి మంత్రి ఇంటి పైకి దండెత్తారు.

మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ లోగా బబ్లు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.  మంత్రి ఇంటి నుంచి  ఒక పిస్టల్ ను,  ఒక రైఫిల్ ను నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు పేర్కొన్నారు.

అయితే తమ భూమిని గ్రామస్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని.. మంత్రి నారాయణ ప్రసాద్ ఆరోపించారు. గ్రామస్తులే మొదట తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ఆ తర్వాత తన కుమారుడు లైసెన్సు కలిగిన తుపాకీతో అక్కడికి వెళ్లడని.. అతనిపైన గ్రామస్తులు రాళ్లతో దాడి చేసినట్లు తెలిపారు తన వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఘటనలోనూ కేంద్రం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతుల మీదికి జీపును తోలి వారి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు అక్టోబర్ 9న నాడు అెస్ట్ చేశారు. Lakhimpur kheri లో  చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్  బృందం అక్టోబర్ 9న ashish mishraను అరెస్ట్ చేసింది. ఆశిష్ మిశ్రా అరెస్ట్ కు సంబంధించి  పోలీస్ ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేయలేదు.

అంతకుముందు ఆదివారం నాడు లఖీంపూర్‌ఖేరీలో చోటు చేసుకొన్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆశిష్ మిశ్రాపై మరికొన్ని ఐపీసీ సెక్షన్లను నమోదు చేయాలని సిట్ జిల్లా పోలీసులకు సిఫారసు చేసిందని సమాచారం. ఆరుగురు సభ్యుల sit బృందం ఆశిష్ మిశ్రాను శనివారం నాడు పొద్దుపోయేవరకు విచారించింది.లఖీంపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందానికి డీఐజీ నేతృత్వం వహిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios