అతనికి పెళ్లై పదేళ్లు అవుతోంది. వయసు పెరిగిపోతున్నా... పిల్లలు మాత్రం కలగడం లేదు. దీంతో భార్య భర్తలు ఇద్దరూ  ఎన్నో గుడుల చుట్టూ తిరిగారు. హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరిగారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో.. తన భార్యకు పిల్లలు కలగాలనే కోరికతో...  సొంత మేనల్లుడిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. తాంత్రికుడు చెప్పాడంటూ పదేళ్ల బాలుడి గొంతు కోసి బలి ఇచ్చాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం భగల్పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... భగల్పూర్ ప్రాంతానికి చెందిన శివనందన్ రవిదాస్(40)కి పదేళ్ల క్రితం ఆశాదేవి(34) అనే మహిళతో వివాహమైంది. వారికి పెళ్లి జరిగి పదేళ్లు గడుస్తున్నా... సంతానం కలగలేదు. బిడ్డల కోసం ఆ దంపతులు ఎంతగానో పరితమించిపోయారు. కాగా.... ఇటీవల శివనందన్ రవిదాస్... ఓ తాంత్రికుడిని కలిశాడు.

అతని సూచన ప్రకారం... మేనల్లుడు కన్నయ్య కుమార్(10) ని బలి ఇస్తే... మీకు సంతానం కలుగుతారని ఆ తాంత్రికుడు శివనందన్ కి తెలియజేశాడు. ఆ మాంత్రికుడు చెప్పింది నిజమని శివనందన్ భావించాడు. సంతానం కలగడం కోసం మేనల్లుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

దీపావళి పండగ రోజు ... మేనల్లుడు కన్నయ్యను మతాబులు కొనిపెడతానని శివనందన్ నమ్మించాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బాలుడుని తీసుకొని మాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అక్కడ బాలుడు గొంతుని పదునైన కత్తితో కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. 

బాలుడు సాయంత్రం ఆరుగంటల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లగా... రాత్రి 11గంటలు అవుతున్నా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బాలుడు తల్లి.. కుటుంబసభ్యులు  అతని కోసం గాలించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా... ఊరి చివరన బాలుడు శవం కనిపించడంతో గ్రామస్థులు కుటుంబసభ్యులకు తెలియజేశారు.

అనుమానంతో విచారించగా.. శివనందన్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.  కాగా... కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు శివనందన్, మాంత్రికుడు ఇద్దరినీ అరెస్టు చేశారు.

కాగా తీవ్రగాయాలపాలై మృత్యువాత పడిన చిన్నారి మృతదేహం కూడా పోలీసులకు దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.