Bharat Bandh On May 25: మే 25 న భారత్ బంద్(Bharat Bandh)కు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(All India Backward And Minority Communities Employees Fedaration) పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని సమాఖ్య పిలుపునిచ్చింది.
Bharat Bandh On May 25 : ఈ నెల 25న ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(All India Backward And Minority Communities Employees Fedaration) భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో ఈ బంద్ కు ఫెడరేషన్ పిలుపునిచ్చినట్టు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ తెలిపారు.
రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ కోసం చట్టం రూపకల్పన, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే.. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం వంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. భారత్ బంద్‌ను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
భారత్ బంద్ పిలుపుకి కారణాలు-డిమాండ్లు
-కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన
-ఈవీఎం కుంభకోణం
-ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు
-రైతులకు కనీస మద్దతు ధర(MSP)హామీఇచ్చేలా చట్టం చేయాలి
-NRC,CAA,NPRకి వ్యతిరేకంగా
-పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించాలనే డిమాండ్
-మధ్యప్రదేశ్, ఒడిశాలో పంచాయితీ ఎన్నికలలో OBC రిజర్వేషన్లలో ప్రత్యేక ఓటర్లు అమలు చేయాలి
- పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజనుల నిర్వాసితులకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలపై నిరసనగా
-టీకాపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా
-లాక్‌డౌన్‌లో రహస్యంగా కార్మికుల కోసం చేసిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
- మే 25 న వ్యాపారాలు మరియు ప్రజా రవాణాను మూసివేయాలని సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
భారతదేశ వ్యాప్తంగా అత్యధిక నిరుద్యోగం ఉన్నందున మే 25 భారత్ బంద్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు, అలాగే.. అభివృద్ధి పేరుతో గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని పలువురు ఆరోపించారు.
తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకే భారత్ బంద్‌కు ఈ డిమాండ్లు ఉన్నాయని రాష్ట్రీయ పిచ్డా వర్గ్ మోర్చా పేర్కొంది. రాహుల్ గాంధీ అధికార ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు, బిజెపి దేశవ్యాప్తంగా కిరోసిన్ పోసిందని, దానికి ఒక నిప్పురవ్వ అవసరమని అన్నారు.