Asianet News TeluguAsianet News Telugu

ఒక్క టీషర్ట్... 17కేసుల్లో దొంగను పట్టించింది..!

బెంగళూరు పులకేశి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చాలాకాలంగా ముప్పతిప్పలు పెట్టి స్తున్న దొంగల ముఠాను ఓ సాధారణ టీషర్టు పట్టించింది. దొంగల ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా ఓ దొంగ బ్యాట్‌ మన్‌ బొమ్మతో కూడిన టీషర్టు ధరించినట్టు కనిపించింది. ఈ ఒక్క ఆధారంగా పోలీసులు వ్యూహా త్మకంగా వల పన్నగా ముఠా గుట్టు రట్టయింది

Bengaluru police arrests theft with the use of T-Shirt clue
Author
Hyderabad, First Published Aug 28, 2019, 9:56 AM IST

ఎంతోకాలంగా దొరకకుండా తప్పించుకుంటున్న ఓ దొంగల ముఠాను కేవలం ఒక్క టీ షర్ట్ పట్టించింది. దాదాపు 17 కేసుల్లో ప్రధాన నిందితుడు... పోలీసుల కళ్లు కప్పి.. తప్పించుకు తిరుగుతున్నాడు. ఎంత ప్రయత్నించినా... దొరకని ఆ దొంగ కేవలం ఒక్కే ఒక్క క్లూ... అది కూడా అతను వేసుకున్న టీషర్ట్ వల్ల దొరికేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

బెంగళూరు పులకేశి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చాలాకాలంగా ముప్పతిప్పలు పెట్టి స్తున్న దొంగల ముఠాను ఓ సాధారణ టీషర్టు పట్టించింది. దొంగల ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా ఓ దొంగ బ్యాట్‌ మన్‌ బొమ్మతో కూడిన టీషర్టు ధరించినట్టు కనిపించింది. ఈ ఒక్క ఆధారంగా పోలీసులు వ్యూహా త్మకంగా వల పన్నగా ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో ప్రముఖ నిందితుడు సయ్యద్‌ మొహసిన్‌ గతంలోనూ అనేక దొంగత నాల కేసుల్లో అరెస్ట్‌ అయి విడుదలయ్యాక కూ డా తన బుద్ది మార్చుకోలేదు.
 
బాణ సవాడి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భారీగా బంగారు గొలు సుల దొంగ తనాలు జరుగుతుండడంతో పోలీ సులకు పెను సవాల్‌గా మారింది. వరుసగా అనేక దోపిడీలు జరిగిన తర్వాత కూడా దొంగల ఆచూకీ లభించకపోవడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని 150కు పైగా సీసీ టీవీ ఫుటేజీలను పోలీసుల బృందం వారం పాటు క్షుణ్ణంగా పరిశీ లించింది. ఊహించినట్టే అనుకోని క్లూ దొరి కింది. 

చైన్‌ స్నాచింగ్‌ జరిగిన ప్రదేశం సమీపం లోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తుండగా టీ షర్టు వేసుకొని హెల్మెట్‌ ధరించి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. ఇది పెద్ద క్లూ కానప్పటికీ అతని టీ షర్టుపై బ్యాట్‌మ్యాన్‌ లోగో ఉంది. ఈ ఒక్క క్లూ తోనే పోలీసులు దొంగలపై వలపన్నారు. దీంతో ముఠాలోని ఆరుగురు సభ్యులను కూడా పట్టివేసి వారి వద్ద నుంచి 12.6 లక్షల విలువ చేసే అరకిలోకు పైగా బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. టీ షర్టు లోగో పుణ్యమా అని దాదాపు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న 17 చైన్‌ స్నాచింగ్‌ కేసుల మిస్టరీ బాణసవాడి పోలీసులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios