Asianet News TeluguAsianet News Telugu

ఈ డాక్టర్ కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

 ఇలాంటి సందర్భంలో ఓ డాక్టర్ రోగి ప్రాణాలు కాపాడటానికి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరించింది. ఆయన ఎందరికో స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ కథేంటో ఓసారి చూద్దాం..

Bengaluru Doctor Leaves Car, Runs 3 Km To Beat Traffic To Perform Crucial Surgery
Author
First Published Sep 12, 2022, 11:07 AM IST

బెంగళూరు ట్రాఫిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రోడ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. కొంచెం దూరం వెళ్లాలన్నా.. చాలా సమయం పడుతుంది. గంటల తరపడి రోడ్లపై వాహనాలు నిలిలచిపోయి ప్రజలు అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బెంగళూరును ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి.  ఈ క్రమంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మళ్లీ స్వయంగా వివరించాల్సిన అవసరం లేదు. కాగా... ఇలాంటి సందర్భంలో ఓ డాక్టర్ రోగి ప్రాణాలు కాపాడటానికి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరించింది. ఆయన ఎందరికో స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ కథేంటో ఓసారి చూద్దాం..

మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న అత్యవసర ల్యాప్రో స్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఈ ఆపరేషన్ చేసేందుకు ఆయన ఆస్పత్రికి వెళ్లుండగా... సర్జాపూర్-మారాతల్లి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు.

ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యి.. ఆస్పత్రికి వెళ్లాంటే.. చాలా సమయం పడుతుంది. అదే జరిగితే.. హాస్పిటల్ లో ఉన్న రోగి ప్రాణాలు పోతాయి. అందుకు.. ఆ డాక్టర్ మరుక్షణం ఆలోచించకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ కారణంగా ఆ మహిళా రోగి ప్రాణాలు కోల్పోకూడదని భావించిన ఆయన దాదాపు మూడు కిలో మీటర్లు తన కారును అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ.. సదరు మహిళకు ఆపరేషన్ చేశాడు.   


"నేను ప్రతిరోజూ సెంట్రల్ బెంగుళూరు నుండి బెంగుళూరుకు ఆగ్నేయంలో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్, సర్జాపూర్‌కి ప్రయాణిస్తాను. నేను సర్జరీకి సమయానికి ఇంటి నుండి బయలుదేరాను. నా బృందం అంతా సిద్ధంగా ఉంది. నేను చేరుకోగానే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ క్లియర్ కాదని అర్థమై రెండోసారి కూడా ఆలోచించకుండా.. కారు, డ్రైవర్ ని అక్కడే వదదిలేసి.. హాస్పిటల్ వైపు పరిగెత్తాను.’’ అని డాక్టర్ నంద కుమార్ చెప్పారు. 

పేషెంట్‌కి అనస్థీషియా వేయడానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ నందకుమార్ బృందం ఆపరేషన్ థియేటర్‌కు చేరుకోగానే రంగంలోకి దిగింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆయన ఆపరేషన్ కి రెడీ అయ్యి.. వెంటనే ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగిని సమయానికి డిశ్చార్జ్ చేశారు.

డాక్టర్ నందకుమార్ మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. చాలా కాలంగా పిత్తాశయ వ్యాధితో బాధపడుతుండడంతో రోగికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కాగా.. ఆయన చేసిన పని పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న వైద్యులకు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి డాక్టర్లను చూసినప్పుడే ‘ వైద్యో నారాయణో హరి’అని కూడా పిలవాలనిపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios