అయోధ్య కేసు: వాదనల చివరి రోజున సుప్రీంలో హైడ్రామా
అయోధ్య కేసులో వాదనల చివరి రోజున నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అన్ని వర్గాల వాదనలను విన్న రాజ్యాంగ ధర్మాసనం చివరికి తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
న్యూఢిల్లీ: అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. డెడ్‌లైన్ గంటకు ముందే వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది.
అయోధ్యకేసుపై సుప్రీంకోర్టుధర్మాసనం 40 రోజుల పాటు అన్నివర్గాల వాదనలను వింది. చివరిరోజున సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.హిందూ మహాసభకు చెందిన న్యాయవాది కోర్టులో ఓ బుక్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమయంలో వేరే పక్షానికి చెందిన న్యాయవాదులు ఈ పుస్తకాన్ని చించేశారు. ఈ పరిణామంపై సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడే కోర్టు నుండి వాకౌట్ చేస్తానని హెచ్చరించారు
విచారణను పూర్తి చేస్తామని కూడ ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామంతో షాక్ కు గురైన న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు.ఇంకా ఈ కేసు విషయమై ఏమైనా చెప్పాలనుకొంటే మరో మూడు రోజుల వరకు రాతపూర్వకంగా కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసుపై నవంబర్ 17వ తేదీ లోపుగా తుది తీర్పును వెలువరిచే అవకాశం ఉంది. ఈ కేసును త్వరగా తేల్చాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసంన ఏర్పాటు చేసింది.
ఇతర కేసులను పక్కన పెట్టి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు ఇదే కేసును విచారించింది. ఈ కేసులో ప్రధానంగా మూడు పక్షాలు 40 రోజుల పాటు తమ వాదనలను విన్పించాయి. అయితే తమ వాదనలను సమర్ధించుకొనేలా ఈ పక్షాలు వాదనలు చేశాయి.
సున్నీ వక్ప్‌బోర్డు, హిందూ మహాసభ, రాంలాల్ విరాజ్ మాన్ లు తమ వాదనలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు విన్పించాయి. తమ వాదనలకు బలం చేకూరేలా ఆధారాలను కూడ చూపాయి.
అయోధ్య కేసులో చివరి రోజున సున్నీ వక్ఫ్ బోర్డు తన వాదనలను విన్పించింది. ఇంకా ఈ కేసులో తమ వాదనలను విన్పించే అవకాశం లేకుండా పోయింది. కాకపోతే తమ వాదనలను రాతపూర్వకంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి విన్పించే అవకాశం ఉంది.
ఈ కేసు విషయమై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఆయా పార్టీల వాదనలను వింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ లోపుగానే ఈ కేసుపై తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది నవంబర్ 17 వ తేదీ లోపుగానే ఈ కేసుపై తుది తీర్పును వెలువరిచే అవకాశం ఉందని సమాచారం.