ఈ ప్రమాదం అర్థరాత్రి 2.30 గంటలకు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరులో అతివేగంగా వస్తున్న ఓ ఆడి కారు కరెంటు స్తంభానికి గుద్దుకోవడంతో కారులో ఉన్న ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం అర్థరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా 20 యేళ్ల వయసువారు కావడం విషాదకరం. మృతుల్లో తమిళనాడు హోసూరు డీఎంకె ఎమ్మెల్యే వై. ప్రకాశ్ కుమారుడు కరుణసాగర్, కోడలు బిందు కూడా ఉన్నారు. కారు అతి వేగంగా స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
