ఈటానగర్: నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యే త్రిరంగ్ అబో ఎన్ఎస్‌సిఎన్-ఐఎం వేర్పాటువాద సంస్థ చేతిలో మంగళవారం నాడు హత్యకు గురయ్యారు.

త్రిరంగ్ అబో‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన 8 మంది కూడ టెర్రరిస్టుల చేతిలో మరణించారు.  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బోగపని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్సా పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  టెర్రరిస్టుల దాడిని మేఘాలయా సీఎం సంగ్మా ఖండించారు.  త్రిరంగ్ ను హత్య చేసిన కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.