Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం.. 50మందికి కోవిడ్ పాజిటివ్...

కరోనా సోకిన వారందరికీ covid guidlines ప్రకారం చికిత్స అందిస్తున్నారు. బిజెపి కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజర్  చేశారు. బిజెపి కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వస్తున్నారు అని బిజెపి నేతలు చెప్పారు.

Around 50 staff members test positive in BJPs Delhi headquarters
Author
Hyderabad, First Published Jan 12, 2022, 1:25 PM IST

న్యూ ఢిల్లీ : దేశ రాజధాని నగరమైన delhiలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బందికి covid-19 positive అని తేలినట్లు బుధవారం ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. BJP ప్రధాన కార్యాలయంలో సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా కో-హెడ్ ఇన్ ఛార్జ్ సంజయ్ మయూఖ్ తో సహా దాదాపు 50 మందికి  corona virus సోకింది.  

దీంతో వారిని Quarantine కు పంపించారు. కరోనా సోకిన వారందరికీ covid guidlines ప్రకారం చికిత్స అందిస్తున్నారు. బిజెపి కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజర్  చేశారు. బిజెపి కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వస్తున్నారు అని బిజెపి నేతలు చెప్పారు.

మంగళవారం Uttar Pradesh Assembly Elections 2022 లపై భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈరోజు రెండో విడత సమావేశం జరగనుంది. సోమవారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు Jagat Prakash nadda  తనకు కోవిడ్ సోకినట్లు చెప్పారు.  

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు ఎస్ బొమ్మై, బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ  సహాయ మంత్రి  అజయ్ భట్ లకు కూడా సోమవారం Covid 19 పాజిటివ్ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో 1,94,720 తాజా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా వల్ల 442 మంది మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ BJPలో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి Radha Mohan Singhకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హాజరైన సమావేశంలో పార్టీ పెద్దలంతా పాల్గొన్నారు.  వారిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్  స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఉన్నారు.  

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, యూపీ ఇంచార్జ్ రాధామోహన్ సింగ్ కు మంగళవారం ఉదయం Corona positivityవ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. Assembly electionsకు సిద్ధమవుతున్న తరుణంలో నిన్న రాత్రి అక్కడి పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. 

రాధా మోహన్ సింగ్, స్వతంత్ర దేవ్ సింగ్, ఆ పక్కనే ఆదిత్యనాథ్ కూర్చుని కార్యాచరణపై చర్చించారు,  రాధా మోహన్ సింగ్ షేర్ చేసిన ఫోటోలను బట్టి ఆ విషయం  వెల్లడవుతోంది.  ఇదిలా ఉండగా..  ఈరోజు స్వతంత్ర దేవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుండడం గమనార్హం.  

మరోపక్క ఈ ఎన్నికల కోసమే యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తదితరులు బిజెపి కోర్కమిటీ సమావేశం కోసం  ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

 నిన్న సాయంత్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అధిక ప్రమాదంలో ఉంటే తప్ప,  kovit పాజిటివ్గా తేలిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios