శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పేలుడు సంభవించింది. శక్తివంతమైన ఐఈడి పేలి ఆర్మీ మేజర్, జవాను మరణించారు. నౌషేరా సెక్టార్ లోని లామ్ ప్రాంతంలో మిలిటెంట్లు ఐఈడీని పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. 

నౌషేరా సెక్టార్ లోని లామ్ ప్రాంతంలో ఐఈడి పేలుడు సంభవించి ఓ అధికారి, సైనికుడు మరణఇం్చారని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పాడు.

గాయపడిన సైనికాధికారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. చికిత్స పొందుతూ అధికారి మరణించాడని చెప్పారు. ఈ సంఘటనతో సైనికులను అప్రమత్తం చేశారు.