Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్: ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపునకు అనుమతి

ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపునకు  హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నె 25న ఓట్ల లెక్కించాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.  అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. 

AP High court gives green singal for Eluru corporation votes counting lns
Author
New Delhi, First Published Jul 22, 2021, 12:06 PM IST

అమరావతి: ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు హైకోర్టు అనుమతించింది. హైకోర్టు ఆదేశాలతో  ఈ నెల 25వ తేదీన కార్పోరేషన్ ఓట్లను లెక్కించనున్నారు. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. ఏలూరు కార్పోరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకొంది. 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ  ఓట్ల లెక్కింపు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో  రాష్ట్ర ఎన్నికల సంఘం  ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపునకు చర్యలు తీసుకొంటుంది. రాష్ట్రంలోని కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో  మెజారిటీ స్థానాల్లో  వైసీపీ విజయం సాధించింది.  విపక్షాలు నామమాత్రంగానే విజయం సాధించారు. కోర్టులో కేసు కారణంగా ఎన్నికల కౌంటింగ్ నిలిచిపోయింది.  హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం  ఏర్పాట్లు చేస్తోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios